‘అతన్ని ప్రేమిస్తే.. అందరికి చెప్తాను’

Tamil Bigg Boss Oviya Speaks About Co Participant Aarav - Sakshi

అతగాడితో ప్రేమలో పడితే తనే అందరికి చెబుతానని అంటోంది తమిళ నటి ఓవియ. ‘బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో’ ద్వారా బాగా ప్రచారం పొందిన నటి ఈ అమ్మడేనని చెప్పవచ్చు. తొలి చిత్రం ‘కలవాని’ విజయం సాధించినా ఆ తరువాత నటించిన చిత్రాలేవీ ఓవియ కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు.  అలాంటి తరుణంలో ‘బిగ్‌బాస్‌ గేమ్‌ షో’కు పిలుపొచ్చింది. అందులో పాల్గొన్న మరో నటుడు ఆరవ్‌తో ప్రేమ, వివాదం అంటూ వార్తల్లోకెక్కి బాగా ప్రచారం పొందింది ఓవియా. షో నుంచి బయటకు వచ్చిన తరువాత నటిగా అవకాశాలు రావడం మొదలెట్టాయి.

నటుడు, దర్శకుడు రాఘవలారెన్స్‌ తెరకెక్కిస్తున్న ‘కాంచన–3’లో ఓవియా, ఆయనతో జతకట్టింది. ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా మార్చిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ‘90 ఎంఎల్‌’ అనే మరో చిత్రంలోనూ ఓవియ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఓవియా నటుడు ఆరవ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందనే ప్రచారం జోరందుకుంది. ఈ సందర్భంగా ఓవియ ఒక ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఓవియా మాట్లాడుతూ.. ‘‘బిగ్‌బాస్‌ గేమ్‌ షో’లో పాల్గొనడం సంతోషకరం. ఆ తరువాత పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. అందులో నచ్చిన కథలనే అంగీకరిస్తున్నాను. నా సినీ పయనాన్ని ఇతరులతో పోల్చడం నాకిష్టం లేదు. నేను తీసుకున్న నిర్ణయాలు నాకు సంతృప్తినిస్తున్నాయి. నటుడు ఆరవ్‌తో నన్ను కలిపి చాలా వదంతులు ప్రచారం అవుతున్న విషయం తెలుసు. అయితే మా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి’ అన్నారు.

అంతేకాక ‘మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా అభిమానం ఉంది. దీన్ని స్నేహం అని చెప్పలేను. అందరూ అనుకున్నట్లు మా మధ్య ప్రేమ లాంటిది ఏమైనా పుడితే నేనే ఆ విషయం స్వయంగా అందరికీ చెబుతాను. ప్రస్తుతం మేం సినిమాల మీద దృష్టిపెడుతున్నాం. నేను ప్రస్తుతం ‘కలవాని–2’, ‘కాంచన–3’, ‘90 ఎంఎల్‌’ చిత్రాల్లో నటిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు ఓవియా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top