తమన్నా ఇంట పెళ్లి సందడి | Tamanna is getting married in the house | Sakshi
Sakshi News home page

తమన్నా ఇంట పెళ్లి సందడి

Jul 2 2017 1:47 AM | Updated on Sep 5 2017 2:57 PM

పెద్దలు ఇల్లు కట్టి చూడు.పెళ్లి చేసి చూడు అని ఊరికే అనలేదు. అందులో భారం ఉన్నా.అంతకు మించిన ఆనందం ఉంటుంది. అలాంటి సంతోషం నటి తమన్నా ఇంట ఇటీవల వెల్లివిరిసింది.

తమిళసినిమా: పెద్దలు ఇల్లు కట్టి చూడు.పెళ్లి చేసి చూడు అని ఊరికే అనలేదు. అందులో భారం ఉన్నా.అంతకు మించిన ఆనందం ఉంటుంది. అలాంటి సంతోషం నటి తమన్నా ఇంట ఇటీవల వెల్లివిరిసింది. ఆగండాగండి. ఏమిటీ తమన్నా ఇంట పెళ్లి సందడి అనగానే ఏదేదో ఊహించేసుకుంటున్నారా? అంతలేదు.తమన్నా అభిమానులు నిరుత్సాహపడనవసరం లేదు.తమన్నా ఇంట పెళ్లి సందడి అన్నామే గానీ ఆమె వివాహం అని చెప్పలేదుగా. అయితే తమన్నా మాత్రం తన పెళ్లి కంటే ఎక్కువగా సంబరపడిపోయిందట.

బాహుబలి, తమిళంలో అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రాల్లో చాలా బిజీగా నటించిన తమన్నా ఇటీవల నటనకు చిన్న బ్రేక్‌ ఇచ్చి తన వ్యక్తిగత పనుల్లో మునిగిపోయారు.ఇంతకీ ఈ బ్యూటీకి అంతగా వ్యక్తిగత పనులేంటబ్బా అనేగా మీ ప్రశ్న. తమన్నాకు ఆనంద్‌ భాటియా అనే ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయనకు పెళ్లి నిశ్చయం అయ్యిందట. ఈ వివాహ నిశ్చితార్థ కార్యక్రమాన్ని తమన్నా కుటుంబం ఆడంబరంగానే నిర్వహించిందట. ఆ వేడుకలో బాగా ఎంజాయ్‌ చేసిన తమన్నా ఆ ఫొటోలను, తను ఎంతగా సందడి చేసిందే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విడుదల చేసింది.ఆ ఫొటోలిప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement