చిన్న సినిమాకు సూపర్‌స్టార్‌ ప్రశంసలు | Superstar Rajinikanth praises Aruvi | Sakshi
Sakshi News home page

Dec 24 2017 8:49 AM | Updated on Dec 24 2017 8:49 AM

Superstar Rajinikanth praises Aruvi - Sakshi

తమిళ సినిమా: ఎవరినైనా ప్రశంసించాలంటే చాలా పెద్ద మనసు కావాలి. అదే విధంగా రజనీకాంత్‌ లాంటి సూపర్‌స్టార్‌ నుంచి అభినందనలు అందుకోవాలంటే వారు ఎంతో ప్రతిభను చాటు కోవాల్సి ఉంటుంది. అలాంటి అభినందనలను నవ దర్శక, కథానాయికలు పొందగలిగారు. వారే అరువి చిత్ర దర్శకుడు అరుణ్‌ప్రభు పురుషోత్తమన్, ఆ చిత్ర కథానాయకి అతిధిబాలన్‌. పలు భారీ చిత్రాలను నిర్మించిన డ్రీమ్‌వారియర్‌ ఫిలింస్‌ అధినేతలు ఎస్‌ఆర్‌.ప్రకాశ్, ఎస్‌ఆర్‌.ప్రభు నిర్మించిన తాజా చిత్రం అరువి.

పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన అరువి చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణను విశేషంగా పొందుతోంది.ఇక చిత్ర ప్రముఖులు ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిత్రం చూసి ఫోన్‌లోనే చిత్ర దర్శకుడు అరుణ్‌ప్రభు పురుషోత్మమన్‌ను అభినందించారు.తాజాగా ఇటీవల మరోసారి అరువి సినిమా చూసిన రజనీకాంత్‌ ఆ చిత్ర దర్శకుడు అరుణ్‌ప్రభు, కథానాయకి అతిధిబాలన్‌లను ఇంటికి పిలిపించి ప్రశంసలలో ముంచెత్తడంతో పాటు బంగారు గొలుసులను బహూకరించారు. 

ఈ సందర్భంగా అరువి చిత్ర నిర్మాత ఎస్‌ఆర్‌.ప్రభును మీరు ఇంతకు ముందు నిర్మించిన చిత్రాలేమిటని అడిగారు. జాతీయ అవార్డును గెలుచుకున్న జోకర్, మానగరం, ధీరన్‌ అధికారం ఒండ్రు లాంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించినట్లు నిర్మాత చెప్పడంతో మీ చిత్రాలన్నీ తాను చూశానని, భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి చిత్రాలు నిర్మించాలని అభినందించారు. దర్శకుడిని ఉద్దేశించి బ్రిలియంట్, ఎక్స్‌లెంట్, ట్రెమండస్‌ చిత్రం అరువి అని ప్రశంసించారు.ఈ చిత్ర కథను ఎక్కడ నుంచి మొదలెట్టారని అడిగారు.

తానీ చిత్రాన్ని తన ఇంట్లో ఒంటరిగా చూశానని, అయినా ప్రేక్షకుల మధ్య చూసినంత అనుభూతి కలిగిందని అన్నారు. ఎంతగా ఏడ్చేశానో, ఇంకెంతగా నవ్వుకున్నానో అని అన్నారు.ఇక హీరోయిన్‌ అతిధిబాలన్‌ అద్భుతంగా అభినయించారని అభినందించారు. ఇలాంటి టీమ్‌ పది కాలాల పాటు పరిశ్రమలో ఉండాలని ఆకాంక్షిస్తూ అభినందించారు.రజనీ అభినందనలకు అరువి చిత్ర దర్శక నిర్మాతలు, కథానాయకి పులకించిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement