
ప్రేక్షకులను తొలిసారి భయపెడతా: సన్నీ లియోన్
శృతిమించిన శృంగార సన్నివేశాలతో ప్రేక్షకులను మత్తెక్కించే ఇండో-కెనడియన్ స్టార్ సన్నీ నియోల్ తొలిసారి విభిన్న పాత్రలో దర్శనమివ్వనుంది.
శృతిమించిన శృంగార సన్నివేశాలతో ప్రేక్షకులను మత్తెక్కించే ఇండో-కెనడియన్ స్టార్ సన్నీ నియోల్ తొలిసారి విభిన్న పాత్రలో దర్శనమివ్వనుంది. తన తాజా చిత్రం 'రాగిణి ఎంఎంఎస్ 2' ద్వారా ప్రేక్షకులను భయపెడతానని చెబుతోంది. ఏడాది నుంచి షూటింగ్ జరుపుకొంటున్న ఈ హర్రర్ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు. 'ఈ చిత్రం విడుదల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా. ఇందులో విభిన్న పాత్ర పోషిస్తున్నాను. ప్రేక్షకులను తొలిసారి భయపెడతాననే నమ్మకముంది' అని సన్నీ లియోన్ చెప్పింది. భూషణ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మిస్తోంది.
గతంలో నీలి చిత్రాల్లో నటించిన సన్నీ లియోన్ ప్రస్తుతం ముంబైలోనే మకాం వేసి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. సన్నీ లియోన్ నటించిన హిందీ సినిమాలు విడుదలయ్యాయి. తాజా చిత్రాన్ని 'రాగిణి ఎంఎంఎస్'కు సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు.