breaking news
Ragini MMS 2
-
రాగిణి.. అంచనాలను దాటిపోయింది: సన్నీ లియోన్
తన తాజా సినిమా రాగిణి ఎంఎంఎస్2 అంచనాలను మించి సంచలన విజయం సాధించడంతో సెక్సిణి సన్నీ లియోన్ సంబరపడిపోతోంది. ఏక్తాకపూర్ నిర్మించిన ఈ సినిమా అంత హిట్ అవుతుందని తాను ఊహించలేదని చెబుతోంది. 'నిజం చెప్పాలంటే, ఈ సినిమా ఇంత విజయం సాధిస్తుందని నేను అనుకోలేదు. రాగిణి ఎంఎంఎఎస్2 మా అంచనాలను ఎప్పుడో దాటిపోయింది. అది చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు నన్ను ఆదరించినట్లే అనిపిస్తోంది. అది చాలా బాగా అనిపిస్తుంది' అని అమెరికా వెళ్లడానికి ముందు సన్నీ చెప్పింది. మార్చి 21న విడుదలైన రాగిణి ఎంఎంఎస్2 చిత్రం మొదటి రెండువారాల్లోనే బాక్సాఫీసు వద్ద రూ. 45.88 కోట్లు వసూలు చేసింది. బిగ్ బాస్5 రియాల్టీ షోతో తొలిసారిగా సన్నీ లియోన్ భారత్లో అడుగుపెట్టింది. తర్వాత 'జిస్మ్ 2' చిత్రంలో అందాలు ఆరబోసింది. అయితే, సంసారపక్షంగా సినిమా చూడాలనుకునేవాళ్లు ఇంతకాలం ఆమెను ఆదరించలేదు. దాంతో సన్నీ చాలా బాధపడింది. అప్పట్నుంచి ఎలాగైనా ఓ మంచి సినిమా చేసి తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నించి.. ఎట్టకేలకు విజయం సాధించింది. తనను విమర్శించేవాళ్లకు సరిగ్గా ఇదే విషయాన్ని చెప్పదలచుకున్నానని, వాళ్లందరికీ సరైన సమాధానం రాగిణి సినిమాయేనని సన్నీ లియోన్ చెప్పింది. ప్రతివాళ్లకూ గతం ఉంటుందని, అలాగే తాను కూడా గతంలో 'పెద్దల' సినిమాల్లో నటించినా, ఇప్పుడు మారిపోయానని తెలిపింది. అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత పార్టీలకు వెళ్లడం మానేసి హిందీ నేర్చుకుంటానని స్పష్టం చేసింది. -
'సన్నిలియోన్ పై దేశ బహిష్కరణ విధించాలి'
థానే: సన్నిలియోన్ పై దేశ బహిష్కరణ విధించి, రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రంపై నిషేధం విధించాలని హిందూ జన్ జాగృతి సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ చిత్రంపై ఫిర్యాదు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) మెమోరాండం సమర్పించారు. ఈ చిత్రంపై నిషేధం విధించకపోతే.. రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రం పదర్శించే సినిమా హాళ్ల వద్ద ఆందోళన చేపడుతామని హెచ్ జేఎస్ హెచ్చరించింది. భారతీయ సంస్కృతి, హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్న రాగిణి ఎంఎంఎస్ 2 చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని సీబీఎఫ్ సీకి విజ్క్షప్తి చేసింది. హిందువులు పవిత్రంగా భావించే శ్రీ హనుమాన్ చాలీసా మంత్రంతో ఈ చిత్రం ప్రారంభం కావడం ఆక్షేపనీయమని, దాని వల్ల మత, సామాజిక ఘర్షణలు తలెత్తే ప్రమాదముందని వారన్నారు. అసభ్యకరమైన చిత్రాల్లో నటిస్తూ యువతను రెచ్చగొడుతున్న సన్నిలియోన్ ను దేశం నుంచి బహిష్కరించాలని మెమోరాండంలో డిమాండ్ చేశారు. -
ప్రేక్షకులను తొలిసారి భయపెడతా: సన్నీ లియోన్
శృతిమించిన శృంగార సన్నివేశాలతో ప్రేక్షకులను మత్తెక్కించే ఇండో-కెనడియన్ స్టార్ సన్నీ నియోల్ తొలిసారి విభిన్న పాత్రలో దర్శనమివ్వనుంది. తన తాజా చిత్రం 'రాగిణి ఎంఎంఎస్ 2' ద్వారా ప్రేక్షకులను భయపెడతానని చెబుతోంది. ఏడాది నుంచి షూటింగ్ జరుపుకొంటున్న ఈ హర్రర్ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు. 'ఈ చిత్రం విడుదల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా. ఇందులో విభిన్న పాత్ర పోషిస్తున్నాను. ప్రేక్షకులను తొలిసారి భయపెడతాననే నమ్మకముంది' అని సన్నీ లియోన్ చెప్పింది. భూషణ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మిస్తోంది. గతంలో నీలి చిత్రాల్లో నటించిన సన్నీ లియోన్ ప్రస్తుతం ముంబైలోనే మకాం వేసి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. సన్నీ లియోన్ నటించిన హిందీ సినిమాలు విడుదలయ్యాయి. తాజా చిత్రాన్ని 'రాగిణి ఎంఎంఎస్'కు సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు.