రాగిణి.. అంచనాలను దాటిపోయింది: సన్నీ లియోన్ | 'Ragini MMS 2' has gone beyond our expectations, says Sunny Leone | Sakshi
Sakshi News home page

రాగిణి.. అంచనాలను దాటిపోయింది: సన్నీ లియోన్

Apr 2 2014 2:38 PM | Updated on Sep 2 2017 5:29 AM

రాగిణి.. అంచనాలను దాటిపోయింది: సన్నీ లియోన్

రాగిణి.. అంచనాలను దాటిపోయింది: సన్నీ లియోన్

తన తాజా సినిమా రాగిణి ఎంఎంఎస్2 అంచనాలను మించి సంచలన విజయం సాధించడంతో సెక్సిణి సన్నీ లియోన్ సంబరపడిపోతోంది.

తన తాజా సినిమా రాగిణి ఎంఎంఎస్2 అంచనాలను మించి సంచలన విజయం సాధించడంతో సెక్సిణి సన్నీ లియోన్ సంబరపడిపోతోంది. ఏక్తాకపూర్ నిర్మించిన ఈ సినిమా అంత హిట్ అవుతుందని తాను ఊహించలేదని చెబుతోంది. 'నిజం చెప్పాలంటే, ఈ సినిమా ఇంత విజయం సాధిస్తుందని నేను అనుకోలేదు. రాగిణి ఎంఎంఎఎస్2 మా అంచనాలను ఎప్పుడో దాటిపోయింది. అది చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు నన్ను ఆదరించినట్లే అనిపిస్తోంది. అది చాలా బాగా అనిపిస్తుంది' అని అమెరికా వెళ్లడానికి ముందు సన్నీ చెప్పింది. మార్చి 21న విడుదలైన రాగిణి ఎంఎంఎస్2 చిత్రం మొదటి రెండువారాల్లోనే బాక్సాఫీసు వద్ద రూ. 45.88 కోట్లు వసూలు చేసింది.

బిగ్ బాస్5 రియాల్టీ షోతో తొలిసారిగా సన్నీ లియోన్ భారత్లో అడుగుపెట్టింది. తర్వాత 'జిస్మ్ 2' చిత్రంలో అందాలు ఆరబోసింది. అయితే, సంసారపక్షంగా సినిమా చూడాలనుకునేవాళ్లు ఇంతకాలం ఆమెను ఆదరించలేదు. దాంతో సన్నీ చాలా బాధపడింది. అప్పట్నుంచి ఎలాగైనా ఓ మంచి సినిమా చేసి తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నించి.. ఎట్టకేలకు విజయం సాధించింది. తనను విమర్శించేవాళ్లకు సరిగ్గా ఇదే విషయాన్ని చెప్పదలచుకున్నానని, వాళ్లందరికీ సరైన సమాధానం రాగిణి సినిమాయేనని సన్నీ లియోన్ చెప్పింది. ప్రతివాళ్లకూ గతం ఉంటుందని, అలాగే తాను కూడా గతంలో 'పెద్దల' సినిమాల్లో నటించినా, ఇప్పుడు మారిపోయానని తెలిపింది. అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత పార్టీలకు వెళ్లడం మానేసి హిందీ నేర్చుకుంటానని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement