'సన్నిలియోన్ పై దేశ బహిష్కరణ విధించాలి' | Hindu Janjagruti Samiti (HJS) demands ban on 'Ragini MMS 2', threatens stir | Sakshi
Sakshi News home page

'సన్నిలియోన్ పై దేశ బహిష్కరణ విధించాలి'

Mar 26 2014 2:00 PM | Updated on Sep 2 2017 5:12 AM

'సన్నిలియోన్ పై దేశ బహిష్కరణ విధించాలి'

'సన్నిలియోన్ పై దేశ బహిష్కరణ విధించాలి'

సన్నిలియోన్ పై దేశ బహిష్కరణ విధించి, రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రంపై నిషేధం విధించాలని హిందూ జన్ జాగృతి సమితి డిమాండ్ చేసింది.

థానే: సన్నిలియోన్ పై దేశ బహిష్కరణ విధించి, రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రంపై నిషేధం విధించాలని హిందూ జన్ జాగృతి సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ చిత్రంపై ఫిర్యాదు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) మెమోరాండం సమర్పించారు. ఈ చిత్రంపై నిషేధం విధించకపోతే.. రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రం పదర్శించే సినిమా హాళ్ల వద్ద ఆందోళన చేపడుతామని హెచ్ జేఎస్ హెచ్చరించింది. 
 
భారతీయ సంస్కృతి, హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్న రాగిణి ఎంఎంఎస్ 2 చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని సీబీఎఫ్ సీకి విజ్క్షప్తి చేసింది. హిందువులు పవిత్రంగా భావించే శ్రీ హనుమాన్ చాలీసా మంత్రంతో ఈ చిత్రం ప్రారంభం కావడం ఆక్షేపనీయమని, దాని వల్ల మత, సామాజిక ఘర్షణలు తలెత్తే ప్రమాదముందని వారన్నారు. అసభ్యకరమైన చిత్రాల్లో నటిస్తూ యువతను రెచ్చగొడుతున్న సన్నిలియోన్ ను దేశం నుంచి బహిష్కరించాలని మెమోరాండంలో డిమాండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement