క్వారంటైన్‌ లైఫ్‌.. చేతికొచ్చిన పంట మాదిరి.. | Sudheer Babu Shares His Upcoming Movie Dialogue With Funny Video | Sakshi
Sakshi News home page

ఏంట్రా గేమ్స్‌ ఆడుతున్నావా.. సుధీర్‌బాబు!

Mar 30 2020 1:19 PM | Updated on Mar 30 2020 1:34 PM

Sudheer Babu Shares His Upcoming Movie Dialogue With Funny Video - Sakshi

కరోనా వైరస్‌ వ్వాప్తిని అరికట్టేందుకు దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సెలబ్రిటీలు ఇలా ఇంటికే పరిమితమవ్వడంతో ఇంట్లో ఖాళీగా ఉండలేక అవస్థలు పడుతున్నారు. టైంపాస్‌ కోసం ఇంటి పనుల్లో బిజీ అయిపోతూ.. సరదాగా చేస్తున్న ఫన్నీ వీడియోస్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. తాజాగా హీరో సుధీర్‌ బాబు కూడా ఓ వీడియోను సోమవారం ట్విటర్‌లో పంచుకున్నారు. (కరోనా విరాళం)

ఈ వీడియోలో సుధీర్‌ తన రాబోయే ‘వి’ సినిమాలోని ఓ డైలాగ్‌ను షేర్‌ చేశాడు. ‘ఏంట్రా గేమ్స్‌ ఆడుతున్నావా...’ అంటూ సిరియస్‌ సాగే ఈ డైలాగ్‌కు లడ్డు తింటూ కామెడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘క్వారంటైన్‌ లైఫ్‌ చూడండి.. చేతికొచ్చిన పంట మాదిరి అన్నమాట.. ఈ గడ్డు కాలం నుంచి త్వరలోనే బయటపడతామని ఆశిస్తున్నాను. అప్పటి వరకు ఈ సినిమా కోసం వేచి ఉండండి’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక సుధీర్‌ వీడియోకు హీరో నాని ‘సోదీ ఆపు @isudheerbabu దమ్ముంటే ఈ సినిమా అప్‌డేట్‌ ఇవ్వూ.. లేదంటే కనీసం పోస్టరైనా రిలీజ్‌ చేయ్యి’ అంటూ సరదాగా కామెంట్‌ చేశాడు. కాగా నాని, సుధీర్‌ బాబులు కలిసి ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ‘వి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అదితిరావు హైదరి, నివేదా థామస్‌ కథానాయికలుగా కనిపిస్తున్న. ఈ సినిమాలో పోలీసు ఆఫిసర్‌గా సుధీర్‌ బాబు.. నెగటీవ్‌ షేడ్స్‌ ఉన్న రాక్షసుడు పాత్రలో నాని కనిపించనున్నాడు. (నాని సినిమాకు కరోనా ఫీవర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement