ఇవి ఉంటే స్వర్గంలో ఉన్నట్టే: రేణుదేశాయ్‌

Strong desire to settle on a farm in a remote village says Renu Desai - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వికారాబాద్‌లోని ఓ గ్రామంలో చిన్నపిల్లలతో సరదాగా గడిపిన ఓ వీడియోను నటి రేణుదేశాయ్‌ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. చిన్న పిల్లలతో బాబా ఫోజ్‌ పెట్టిస్తూ ఆనందంగా గడిపారు. ఆవులు, మేకలు, కాకులు, కొంగల వీడియోలను తన ఇన్‌స్ట్రా గ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసి పల్లె జీవితాన్ని మిస్సవుతున్నానని పేర్కొన్నారు. తన పిల్లలు కాలేజీలో చేరిన తర్వాత మిగిలిన శేష జీవితాన్ని కూరగాయలు పండిస్తూ మారుమూల గ్రామంలో గడపాలని బలంగా కోరుకుంటున్నానని తెలిపారు.

ఓ పది పిల్లులు, 10 శునకాలు, భారీ మొత్తంలో మూగజీవాలు, లెక్కలేనన్ని పుస్తకాలు, ఇవి ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది అంటూ పోస్ట్‌ పెట్టారు. ఆరోజు త్వరలోనే వస్తుందని ఆకాంక్షించారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయట తిరగొద్దు అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్‌కి బదులిస్తూ... ఇవి ఇంతకు ముందు తీసిన వీడియోలని క్యాప్షన్‌ చూసి కామెంట్లు పెట్టాలని రేణుదేశాయ్‌ చురకలంటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top