ఆ ప్రేమకు వారధి ఎవరు..? | Sakshi
Sakshi News home page

ఆ ప్రేమకు వారధి ఎవరు..?

Published Thu, Mar 5 2015 11:29 PM

ఆ ప్రేమకు వారధి ఎవరు..?

ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల మధ్య జరిగే ప్రేమ  నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం - ‘వారధి’.  క్రాంతి, శ్రీదివ్య, హేమంత్ ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రాన్ని కాస్మిక్ ఇమాజినేషన్స్ పతాకంపై వివేకానంద వర్మ నిర్మిస్తున్నారు. సతీష్ కార్తికేయ దర్శకుడు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈ చిత్రం ఈ నెలాఖరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘నలుగురి బాధలో సంతోషాన్ని వెతుక్కునే హీరోకూ, నలుగురూ బాగుండాలనే హీరోయిన్‌కీ మధ్య ప్రేమకథ ఎలా నడిచిందనేది ఆసక్తికరమైన అంశం’’ అని పేర్కొన్నారు.

సతీష్ కార్తికేయ మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా నాకు ఇది తొలి చిత్రం. కథ, కథనాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అందుకు తగ్గట్లే హేమంత్, శ్రీదివ్య, క్రాంతి చాలా చ క్కగా నటించారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ గొర్తి, సాహిత్యం: చైతన్య వర్మ, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement