ఆడపడుచు కోసం... | Sony Charista and Rishika's Naakaithe Nachindi Movie | Sakshi
Sakshi News home page

ఆడపడుచు కోసం...

Sep 14 2014 12:49 AM | Updated on Sep 2 2017 1:19 PM

ఆడపడుచు కోసం...

ఆడపడుచు కోసం...

అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధాలతో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. ఈ సెంటిమెంట్‌తో తెరకెక్కిన పలు చిత్రాలు విజయం సాధించాయి. అలాంటి మ రో వైవిధ్యభరిత కథా చిత్రంగా

 అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధాలతో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. ఈ సెంటిమెంట్‌తో తెరకెక్కిన పలు చిత్రాలు విజయం సాధించాయి. అలాంటి మ రో వైవిధ్యభరిత కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఇంజిమురప్పా. హిల్స్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పణలో రాధాకృష్ణ ఫి లిం సర్క్యూట్ పతాకంపై ఎ.పి.రాధాకృష్ణన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.సహ దర్శకత్వం వహిస్తున్నారు. నవ నటుడు శ్రీ బాలాజీ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సోని శిష్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
 
 ఇతర ముఖ్య పాత్రల్లో కృష్ణ, రిషిక, నెల్లై శివ, మనోహర్ తదితరులు నటిస్తున్నారు. మణిశర్మ సంగీ తాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి పి ఆర్ కె రాజు చాయాగ్రహణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ చె ల్లెలంటే ఎనలేని ప్రేమ గల అన్నయ్య ఆమె భవిష్యత్తును పూ లబాటగా మార్చాలని కలలు కంటుంటాడన్నారు.
 
 అ లాంటి చెల్లెలు ప్రేమ పేరుతో మోసపోవడంతో అ న్నయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడన్నది చిత్ర కథ అన్నారు. హీరో హీరోయిన్ల ప్రేమ, చెల్లెలి అనుబంధం లాంటి పలు జనరంజకమైన అంశాలతో తెరకెక్కిస్తు న్న చిత్రం ఇంజిమురప్పా అని తెలిపారు. చిత్ర ఆడియోను త్వరలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఎస్ సహ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement