బూచెమ్మ బూచోడు | shivaji new movie "bhuchamma" | Sakshi
Sakshi News home page

బూచెమ్మ బూచోడు

Nov 1 2013 11:47 PM | Updated on Aug 28 2018 4:30 PM

బూచెమ్మ బూచోడు - Sakshi

బూచెమ్మ బూచోడు

‘బూచోడు’ అనే పేరు వింటే పిల్లలకు భలే భయం. ‘బూచోడికి పట్టిస్తా’ అని అమ్మానాన్నా భయపెడితే చాలు.. మాట వినకుండా మారాం చేస్తున్న పిల్లలు సైతం టక్కున మాట వినేస్తుంటారు.

 ‘బూచోడు’ అనే పేరు వింటే పిల్లలకు భలే భయం. ‘బూచోడికి పట్టిస్తా’ అని అమ్మానాన్నా భయపెడితే చాలు.. మాట వినకుండా మారాం చేస్తున్న పిల్లలు సైతం టక్కున మాట వినేస్తుంటారు. ఆ విధంగా ప్రతి ఒక్కరికీ ‘బూచోడు’ ఓ అందమైన జ్ఞాపక మే. త్వరలో ఆ బూచోడు... బూచెమ్మను కూడా తోడు తీసుకొని తెరపైకి వచ్చేస్తున్నాడు. ఇంతకీ ఈ ‘బూచెమ్మ బూచోడు’ గోలేంటి... అనుకుంటున్నారా? హీరో శివాజి రాబోతున్న సినిమాకు ఆ పేరు ఖరారు చేశారు. ‘రాగిణి ఎం.ఎం.ఎస్’ ఫేం కైనాజ్ మోతివాలా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రేవన్ యాదు దర్శకుడు. రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి శివాజి మాట్లాడుతూ- ‘‘చక్కని రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. గ్రాఫిక్స్, పాటలు హైలైట్‌గా నిలుస్తాయి.
 
  డిసెంబర్ 20న సినిమాను విడుదల చేస్తాం. ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే సినిమాల్లో మంచి వినోదాన్ని పంచే సినిమా అవుతుంది’’ అన్నారు. కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇదని, పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు. సినిమాపై అభిమానం వల్లే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టామని, అందరినీ అలరించే సినిమా అవుతుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా రచయిత సాయికృష్ణ, బెక్కెం వేణుగోపాల్, కైనాజ్ మోతివాలా కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ మిశ్రా, సంగీతం: రాజ్ భాస్కర్, కూర్పు: ప్రవీణ్‌పూడి.
 6
 కృష్ణవంశీ దర్శకత్వంలో...
 కథల కొరతతో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినిమాకు మళ్లీ మంచి రోజులొస్తున్నట్లున్నాయి. తెలుగు తెరపై మల్టీస్టారర్ సినిమాలు ఊపందుకోవడమే రాబోతున్న మంచి రోజులకు నాంది. ఈ కారణంగా మరిన్ని మంచి కథలు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఆ మాటకొస్తే ప్రేక్షకాభిప్రాయం కూడా అదే. ‘సీతమ్మ వాకిట్లో...’తో ఆల్రెడీ మల్టీస్టారర్ ప్రయాణానికి ఫస్ట్ గేర్ పడిపోయింది... ‘మసాలా’, ‘ఎవడు’ చిత్రాలతో సెకండ్, థర్డ్ గేర్లు పడబోతున్నాయి. ఇక ఫోర్త్ గేర్‌తో సాఫ్ట్‌గా సేఫ్‌గా మరింత వేగవంతంగా మల్టీస్టారర్ ప్రయాణాన్ని కొనసాగించే బాధ్యతను ఇప్పుడు దర్శకుడు కృష్ణవంశీ తీసుకున్నారు.
 
  వెంకటేష్, రామ్‌చరణ్ కలిసి నటించబోతున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించబోతున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి గణేష్ మాట్లాడుతూ- ‘‘పాతికేళ్లుగా తెలుగు తెరపై విక్టరీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వెంకటేష్, అతితక్కువ సమయంలోనే మెగాస్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న చరణ్ కలిసి నటించనున్న ఈ సినిమా... చరిత్రలో నిలిచిపోతుంది. క్రియేటివిటీకీ, తెలుగుదనానికీ మారుపేరైన కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మా సంస్థలో ఇప్పటివరకూ వచ్చిన చిత్రాలన్నింటికంటే భారీగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ఈ సినిమాకు సంబంధించిన కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement