డ్రెస్‌ లేకుంటే యోగా ఇంకా బాగా చేస్తా : శిల్పా శెట్టి | Shilpa shetty Yoga comments viral in Social media | Sakshi
Sakshi News home page

డ్రెస్‌ లేకుంటే యోగా ఇంకా బాగా చేస్తా : శిల్పా శెట్టి

Mar 28 2018 4:16 PM | Updated on Mar 28 2018 7:33 PM

Shilpa shetty Yoga comments viral in Social media - Sakshi

ముంబై :  భార‌తదేశంలో పుట్టి, విదేశాల్లో విశేష ప్రాచుర్యం పొందిన యోగాపై ఇప్పుడు సెల‌బ్రిటీలు ఎడ తెగ‌ని మ‌క్కువ చూపుతున్నారు. యోగా అంటే మనదేశంలో ముందుగా గుర్తొచ్చే సెలబ్రిటీల్లో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ముందుంటారు. యువ‌త‌ యోగాపై మ‌రింత ఆస‌క్తిని పెంచేందుకు శిల్పా శెట్టి యోగా అవ‌గాహ‌న త‌ర‌గ‌తులు కూడా నిర్వహిస్తున్నారు. యోగాని ప్రమోట్‌ చేసే క్రమంలో స్వయంగా తాను చేసిన యోగాసనాలను వీడియోగా రూపొందించి విడుదల చేశారు. అంతేకాకుండా యోగా శిక్షణపై రెండు పుస్తకాలను కూడా శిల్పా రాశారు.

కాగా,  ముంబైలో జరిగిన సోనీ బీబీసీ ఎర్త్‌ చానెల్‌ వార్షికోత్సవ వేడుకకు ప్రముఖ మెడికల్‌ జర్నలిస్ట్‌ డా. మిచెల్‌ మోస్లే వచ్చారు. ఇంకేముంది మిచెల్‌కు కూడా శిల్పా కొన్ని ఆసనాలను వేదికపైనే నేర్పించారు. శిల్పా యోగాసనాలకు ముగ్దుడైన మిచెల్‌ బాగా చేశారంటూ కితాబిచ్చారు. అయితే తాను వేసుకున్న డ్రెస్‌లో యోగా చేయడం అంత సౌకర్యంగా లేదని, డ్రెస్‌ లేకుంటే యోగా ఇంకా బాగా చేసేదాన్ని అంటూ శిల్పా కిలకిల నవ్వేసింది. సరదాగా శిల్పా చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement