ఆమె ఎవరు? | she is waiting cinema shooting started | Sakshi
Sakshi News home page

ఆమె ఎవరు?

Dec 22 2015 12:21 AM | Updated on Sep 3 2017 2:21 PM

ఆమె ఎవరు?

ఆమె ఎవరు?

ఇద్దరు ప్రేమికుల జీవితాల్లోకి ఓ మహిళ ప్రవేశించింది. దాంతో వారి జీవితాలు యూ టర్న్ తీసుకున్నాయి. ఆమె ఎవరు?

ఇద్దరు ప్రేమికుల జీవితాల్లోకి ఓ మహిళ ప్రవేశించింది. దాంతో వారి జీవితాలు యూ టర్న్ తీసుకున్నాయి. ఆమె ఎవరు? అసలు వారి జీవితాల్లోకి ఎందుకొచ్చిందన్న కథాంశంతో సాగే హారర్ చిత్రం ‘షీ’. ‘ఈజ్ వెయిటింగ్’ అనేది ఉపశీర్షిక. మహత్ రాఘవేంద్ర, నటుడు ఉత్తేజ్ కుమార్తె చేతనా ఉత్తేజ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్వేతామీనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పర్స మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అనూప్ సింగ్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు సోదరి రమ్య క్లాప్ ఇచ్చారు. దర్శకుడు పూరి జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. జనవరి 4న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భోలే, సినిమాటోగ్రఫీ: అనిత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బసంత్ రెడ్డి.
 

Advertisement

పోల్

Advertisement