షారూఖ్ అరెస్ట్ తప్పదా..? | Shahrukh Khan Should Be Booked For Vadodara Stampede | Sakshi
Sakshi News home page

షారూఖ్ అరెస్ట్ తప్పదా..?

Jun 16 2017 1:11 PM | Updated on Sep 5 2017 1:47 PM

షారూఖ్ అరెస్ట్ తప్పదా..?

షారూఖ్ అరెస్ట్ తప్పదా..?

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ ఏడాది మొదట్లో విడుదలైన తన మూవీ రాయిస్

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ ఏడాది మొదట్లో విడుదలైన తన మూవీ రాయిస్ ప్రమోషన్ సందర్భంగా ఆయన ప్రవర్తించిన తీరు ఇబ్బందుల్లో పడేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయిస్ ప్రమోషన్ కోసం షారూఖ్ రైల్లో ప్రయాణించారు. ప్రతీ స్టేషన్ లోనూ అభిమానులను పలకరిస్తూ ఉత్సాహపరుస్తూ సాగారు. అయితే వడోదరా స్టేషన్లో మాత్రం పరిస్థితి అదుపు తప్పి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో షారూఖ్ ఇబ్బందుల్లో పడ్డాడు.

ఈ ఏడాది జనవరి 23న రాయిస్ మూవీ ప్రమోషన్లో భాగంగా షారూఖ్ వడోదరా స్టేషన్కు చేరుకున్నారు. షారూఖ్ వస్తున్నాడన్న విషయం ముందే తెలియటంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడి చేరుకున్నారు. అభిమానులను మరింత ఉత్సాహ పరిచేందుకు టీషార్ట్స్, బాల్స్ను వాళ్లు మీదకు విసిరాడు షారూఖ్. దీంతో తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి మరణించాడు. కొంత మంది గాయపడ్డారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షారూఖ్ ఖాన్, రాయిస్ బృంద నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కోర్టుకు తెలిపారు. షారూఖ్తో పాటు రాయిస్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్పై ఐపీసీ సెక్షన్ 304 ఏ 2 (నిర్లక్షంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణం కావటం) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసు కారణంగా షారూఖ్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement