21 ఏళ్ల తరువాత కలిసి నటిస్తున్న ఖాన్లు | Shahrukh Khan Cameo in Salman Khan Tubelight | Sakshi
Sakshi News home page

21 ఏళ్ల తరువాత కలిసి నటిస్తున్న ఖాన్లు

Jan 31 2017 2:53 PM | Updated on Sep 5 2017 2:34 AM

21 ఏళ్ల తరువాత కలిసి నటిస్తున్న ఖాన్లు

21 ఏళ్ల తరువాత కలిసి నటిస్తున్న ఖాన్లు

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానం కోసం షారూఖ్, సల్మాన్లు తెగ పోటిపడుతున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానం కోసం షారూఖ్, సల్మాన్లు తెగ పోటిపడుతున్నారు. ప్రస్తుతం కత్తులు దూసుకుంటున్న సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్లు గతంలో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేశారు. చివరగా 1995లో రిలీజ్ అయిన కరణ్ అర్జున్ సినిమాలో అన్నదమ్ములుగా నటించారు ఈ సూపర్ స్టార్స్. ఆ తరువాత వివాదాలతో దూరమైన ఈ ఇద్దరు, ఈ మధ్య అన్ని మర్చిపోయి ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేస్తున్నారు.

దీంతో మరోసారి ఈ టాప్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తారన్న టాక్ వినిపించింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూసల్మాన్, షారూఖ్లు కలిసి నటించేందుకు అంగీకరించారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ట్యూబ్ లైట్ సినిమాలో షారూఖ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. అయితే అది కూడా సినిమాను మలుపు తిప్పే కీలక పాత్ర కావటంతో ప్రేక్షకులకు ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమానే అనిపిస్తుందంటున్నారు మేకర్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement