బాద్‌షా అభిమానులకు ఈద్‌ కానుక

Shah Rukh Khans New Zero Teaser on Eid - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌ వరుస ఫ్లాప్‌లతో ఇబ‍్బంది  పడుతున్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా షారూక్ ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం షారూఖ్‌ జీరో పేరుతో తెరకెక్కుతున్న  సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాద్‌ షా మరుగుజ్జు పాత్రలో అలరించనున్నాడు. ఆనంద్‌ ఎల్‌ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

టైటిల్‌ టీజర్‌ తరువాత ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవటంతో అభిమానులు సినిమా విశేషాల కోసం ఎదురుచూస్తున్నారు. అభిమానుల కోసం చిత్రయూనిట్ రంజాన్ కానుక ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈద్‌ సందర్భంగా జీరో టీం మరో టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. షారూక్‌ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌, ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్‌, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ స్టా‍ర్స్‌ సల్మాన్‌ ఖాన్‌, దీపికా పదుకొనే, శ్రీదేవి, రాణీ ముఖర్జీ, కాజోల్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top