బుల్లితెర నటికి టోకరా | Serial Actress Complaints at Event Organizer | Sakshi
Sakshi News home page

Feb 26 2018 7:20 PM | Updated on Apr 3 2019 6:34 PM

Serial Actress Complaints at Event Organizer - Sakshi

శిఖా సింగ్‌ (పాత చిత్రం)

సాక్షి, ముంబై : బుల్లితెర నటి, కుండలి భాగ్య ఫేమ్‌ శిఖా సింగ్‌(32) పోలీసులను ఆశ్రయించారు. డబ్బులు ఎగ్గొట్టి తనను మోసం చేసినట్లు ఓ ఈవెంట్‌ మేనేజర్‌పై  ఆమె ఫిర్యాదు చేయటంతో కేసు నమోదయ్యింది.

చతుర్వేది అనే ఈవెంట్‌ మేనేజర్‌ ఘనాలో నిర్వహించే కార్యక్రమంలో నృత్య ప్రదర్శన కోసం నటి శిఖా సింగ్‌తో రూ. 12లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకుగానూ ఆమెకు ముందుగా రూ. 70 వేలు అడ్వాన్స్‌ ఇచ్చాడు. గతేడాది నవంబర్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

అయితే మిగతా అమౌంట్‌ కోసం ఆమె సదరు సంస్థను ప్రశ్నించగా.. ఈవెంట్‌ మేనేజర్‌కు డబ్బు ఎప్పుడో ఇచ్చినట్లు వారు చెప్పారు. దీంతో తాను మోసపోయానని ఆమె గ్రహించింది.  చిటల్సర్‌ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు అయ్యింది. పరారీలో ఉన్న చతుర్వేది కోసం  పోలీసులు గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement