ఫస్ట్ పార్ట్లో హీరో.. సెకండ్ పార్ట్లో విలన్ | Sakshi
Sakshi News home page

ఫస్ట్ పార్ట్లో హీరో.. సెకండ్ పార్ట్లో విలన్

Published Mon, Sep 11 2017 12:36 PM

ఫస్ట్ పార్ట్లో హీరో.. సెకండ్ పార్ట్లో విలన్

బాలీవుడ్ కాంట్రవర్షియల్ హీరో సంజయ్ దత్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా సడక్. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను మహేష్ భట్ తెరకెక్కించారు. పూజా భట్ సంజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయిన 26 ఏళ్ల తరువాత ఇప్పుడు సీక్వల్ ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఈ సీక్వల్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

సడక్ సినిమా ఎక్కడ ఆగిపోయిందో.. అక్కడి నుంచే సడక్ 2 కథ మొదలవుతుందని తెలుస్తోంది. అయితే తొలి భాగంలో హీరోగా నటించిన సంజయ్ దత్ సీక్వల్ లో విలన్ గా కనిపించనున్నాడట. మరో యువ జంట హీరో హీరోయిన్లుగా నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం భూమి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సంజయ్, తరువాత ద గుడ్ మహారాజా సినిమాకు ఓకె చెప్పాడు. ఈ రెండు సినిమా తరువాత సడక్ సీక్వల్ పై క్లారిటీ రానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement