
సాక్షి, బెంగళూరు : సైడ్ బిజినెస్‌గా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న శాండల్‌వుడ్ నిర్మాతను శుక్రవారం బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతాప్‌రంగు అలియాస్ రంగను పోలీసులు అరెస్ట్ చేశారు. డబుల్‌మీనింగ్ అనే కన్నడ సినిమాను నిర్మించిన ఇతను పలు చైన్ స్నాచింగ్‌లలో నిందితుడు. పరారీలో ఉన్న ఇతనిపై వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మడకశిరలో తలదాచుకున్న ఇతనిని శుక్రవారం రాత్రి బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేసి నగరానికి తీసుకువచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది.