‘తిరుపతి పార్ట్‌నర్‌కు థ్యాంక్స్‌’ | Samantha Visits Tirumala Temple By Foot With Friend | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత

Dec 19 2019 12:44 PM | Updated on Dec 19 2019 12:54 PM

Samantha Visits Tirumala Temple By Foot With Friend - Sakshi

మజిలీ, ఓ బేబీ, సూపర్‌ డీలక్స్‌ ఇలా వరుస హిట్లతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు అక్కినేని కోడలు సమంత. పెళ్లి తర్వాత విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా మరింత మెరగవుతున్నారు. అంతేకాదు సినిమా షూటింగ్‌ల నుంచి విరామం దొరికినపుడల్లా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విహరిస్తుంటారు. ఈ క్రమంలో తన స్నేహితురాలు రమ్యా సుబ్రమణియన్‌తో కలిసి సమంత గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలి నడన ఏడుకొండలు ఎక్కి శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నారు.

కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సమంత స్నేహితురాలు రమ్య సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘ ప్రశాంతంగా నడిచిన తర్వాత ఈ చిరునవ్వులు. తిరుపతి దర్శనం ఎంతో అద్భుతం. 2019కి మంచి వీడ్కోలు.. అదే విధంగా 2020కి శుభారంభం. ఇందుకు వెంకటేశ్వరుడికి.. అదే విధంగా నా తిరుపతి పార్ట్‌నర్‌ సమంతకు ధన్యవాదాలు’ అని ఆమె క్యాప్షన్‌ జత చేశారు. కాగా యాంకర్‌గా కెరీర్‌ ఆరంభించిన రమ్య ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీ అయ్యారు. కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ విజయ్‌.. దళపతి 64 సినిమాలో కీలక పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇక చెన్నైకి చెందిన సమంత.. రమ్య మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement