రాజమౌళికి నో చెప్పిన సమంత | Samantha Spurns Rajamouli Offer | Sakshi
Sakshi News home page

రాజమౌళికి నో చెప్పిన సమంత

Jul 13 2014 1:02 PM | Updated on Sep 2 2017 10:15 AM

రాజమౌళికి నో చెప్పిన సమంత

రాజమౌళికి నో చెప్పిన సమంత

అగ్రదర్శకుడి సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ కథానాయికైనా కళ్లుమూసుకుని ఒప్పేసుకుంటుంది. కానీ సమంత దారే వేరు.

అగ్రదర్శకుడి సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ కథానాయికైనా కళ్లుమూసుకుని ఒప్పేసుకుంటుంది. కానీ సమంత దారే వేరు. టాలీవుడ్ టాప్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ను ఆమె వదులుకుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'లో ప్రత్యేక పాత్ర కోసం సమంతను రాజమౌళి అడిగారట. అయితే డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆమె ఈ సినిమాలో నటించేందుకు నో చెప్పింది.

ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ట్వీట్ చేశారు. 'సమంత ఇలా చేశావేంటి. నా సినిమాలో ప్రత్యేక పాత్ర చేయమని స్వయంగా నేడు అడిగితే డేట్స్ ఖాళీ లేవని చెప్పావు. నీ అభిమానులు నా మీద కోపగించుకునేలా చేశావు' అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement