
‘భారత్’ సినిమాతో బాక్సాఫీస్‌పై కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న భాయీజాన్.. మరోసారి తన స్టామినాను చూపించారు. కేవలం తన స్టార్‌డమ్‌పైనే సినిమాలు ఆడతాయని మళ్లీ నిరూపించిన సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్.. ప్రస్తుతం జిమ్‌లో వర్కౌట్లు, స్విమ్మింగ్‌పూల్‌లో జంప్‌లు చేస్తూ సరదాగా గడిపేస్తున్నారు.
ఫిట్‌నెస్‌కు మారుపేరుగా మారిన సల్మాన్ గతకొన్ని రోజులుగా జిమ్‌లో కసరత్తులుచేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తూ ఉన్నారు. తాజాగా సల్లూ భాయ్ మరోపిక్‌ను విడుదల చేశారు. తన శరీరం ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉందో నిరూపించేందుకు.. స్ట్రెచ్చింగ్ చేస్తూ ఉన్న పిక్‌ను పోస్ట్ చేశారు. దీనికి మన భాయీజాన్ ‘ఇన్ స్ప్టిట్స్.. హా హా హా’ అంటూ ట్వీట్ చేశారు. ఇక సల్మాన్ తదుపరి సినిమాల విషయానికొస్తే సంజయ్ లీలా భన్సాలీతో ఓ చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నారు.