శస్త్ర చికిత్స ఆమెకు.. బిల్లు ఈయనకు..! | Salman Khan helped Daisy Shah pay surgery bill | Sakshi
Sakshi News home page

శస్త్ర చికిత్స ఆమెకు.. బిల్లు ఈయనకు..!

Aug 20 2013 12:18 AM | Updated on Apr 3 2019 6:23 PM

శస్త్ర చికిత్స ఆమెకు.. బిల్లు ఈయనకు..! - Sakshi

శస్త్ర చికిత్స ఆమెకు.. బిల్లు ఈయనకు..!

కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ది సున్నితమైన మనసు. ముఖ్యంగా కథానాయికల విషయంలో సల్మాన్ హృదయం చాలా విశాలమైనది. షూటింగ్ సమయంలో వాళ్లకి ఎలాంటి సౌకర్యాలైనా కల్పించడానికి వెనకాడరట.

కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ది సున్నితమైన మనసు. ముఖ్యంగా కథానాయికల విషయంలో సల్మాన్ హృదయం చాలా విశాలమైనది. షూటింగ్ సమయంలో వాళ్లకి ఎలాంటి సౌకర్యాలైనా కల్పించడానికి వెనకాడరట. ఒక్కోసారి భారీ బహుమతులిచ్చి లలనామణులను ఆశ్చర్యపర్చడం సల్మాన్ స్టయిల్ అని బాలీవుడ్‌లో చెప్పుకుంటారు. 
 
 ఇక.. ఇటీవల జరిగిన ఓ విషయానికొస్తే... సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందుతున్న ఓ చిత్రంలో ఆయన సరసన ఒక కథానాయికగా డైసీ షా నటిస్తున్నారు. ఈ సినిమాలో చక్కని శరీరాకృతితో కనిపించాలనే తపనతో, మంచి షేప్ కోసం ఆస్పత్రిలో చేరారట డైసీ. 
 
 దాదాపు 48 గంటల పాటు ఆమె ఆస్పత్రిలో ఉన్నారని, శస్త్ర చికిత్స జరిగిందని సమాచారం. ఫలితంగా లక్షన్నర బిల్లు అయ్యిందట. ఆ బిల్లు చెల్లించి డైసీని ఆశ్చర్యానందాలకు గురి చేశారట సల్మాన్‌ఖాన్. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement