యార్‌ ఇవన్ ట్రైలర్‌ లాంచ్ | Sachin Joshi Yaar ivan trailer Launch | Sakshi
Sakshi News home page

యార్‌ ఇవన్ ట్రైలర్‌ లాంచ్

Jun 28 2017 10:25 AM | Updated on Sep 5 2017 2:42 PM

యార్‌ ఇవన్ ట్రైలర్‌ లాంచ్

యార్‌ ఇవన్ ట్రైలర్‌ లాంచ్

నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం యార్‌ ఇవన్. ఇంతకు ముందు తెలుగులో పలు చిత్రాల్లో

నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం యార్‌ ఇవన్. ఇంతకు ముందు తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సచిన్ యార్‌ ఇవన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. వికింగ్స్ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు టి.సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇషాగుప్తా హీరోయిన్ గా  నటిస్తున్న ఈ సినిమాలో ప్రభు, కిశోర్, సతీష్‌ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.

ఎస్‌ఎస్‌.తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి సి.కల్యాణ్, కాట్రగడ్డప్రసాద్, ఎల్‌.సురేశ్‌ వచ్చి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఒక యువకుడి భార్య హత్యకు గురైతే అందుకతను హంతకులపై ఎలా రివెంజ్‌ తీసుకున్నాడన్న క్రైం థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన చిత్రం యార్‌ఇవన్ అని చిత్ర వర్గాలు తెలిపాయి. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement