‘కబాలి’ నిర్మాతతో ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో..!

Rk 100 Fame Karthikeya Movie With Kabali Producer - Sakshi

ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ఆర్‌ఎక్స్‌ 100. రామ్‌ గోపాల్‌ వర్మ శిష్యుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు. బోల్డ్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకోవటంతో వసూళ్ల పంట పండింది. అంతేకాదు ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతితో పాటు హీరోగా నటించిన కార్తికేయకు పెద్ద బ్యానర్‌ల నుంచి ఆఫర్లు అందుతున్నాయి.

తాజాగా హీరో కార్తికేయ ఓ తమిళ నిర్మాణ సంస్థ నిర్మించబోయే సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్‌లో కబాలి లాంటి భారీ బడ్జెట్‌ చిత్రాలను అందించిన కలైపులి ఎస్‌ థాను నిర్మించబోయే సినిమాలో కార్తికేయ హీరోగా నటించనున్నాడట. ఈ సినిమాకు ఎన్‌ కృష్ణ దర్శకత్వం వహించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా తమిళ్‌లోనే తెరకెక్కిస్తారా.. లేక బైలింగ్యువల్‌గా తెరకెక్కిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top