
శంషాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనమైన ‘దిశ’ఘటనను తనకున్న సామర్థ్యంతో ఉద్వేగభరితంగా చిత్రం తీసేందుకు యత్నిస్తున్నానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ‘దిశ’చిత్ర కథను తయారు చేసుకునే క్రమంలో సోమవారం శంషాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కథ పరిశోధనలో ఉండటంతో అందులో ప్రధానమైన అంశం ఏమిటనేది ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు.