‘సుశాంత్‌ను‌ అందుకే తొలగించారా!’ | The Real Reason Sushant Singh Rajput Was Forced To Drop Out Of Half Girlfriend | Sakshi
Sakshi News home page

‘ఇకపై స్టార్‌కిడ్స్‌ సినిమాలను చూడొద్దు’

Jun 25 2020 8:50 AM | Updated on Jun 25 2020 9:44 AM

The Real Reason Sushant Singh Rajput Was Forced To Drop Out Of Half Girlfriend - Sakshi

ముంబై: సినీ రచయిత చేతన్‌ భగత్‌ ఐదేళ్ల క్రితం చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో నెటిజన్లు బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మోహిత్‌ సూరి దర్శకత్వంలో వస్తున్న ‘హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ లీడ్‌రోల్‌లో నటించబోతున్నాడు. ఇది చాలా సంతోషంగా ఉంది’ అంటూ 2015లో చేతన్‌ చేసిన ట్వీట్ ప్రస్తుతం‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చివరికి ఈ సినిమాలో అర్జున్‌ కపూర్‌ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కావాలనే ఈ సినిమా నుంచి సుశాంత్‌ను తొలగించారంటూ దర్శకుడిపై, అర్జున్ కపూర్‌‌, బాలీవుడ్‌ ప్రముఖులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో బంధుప్రీతి(నెపొటిజం) కారణంగా సుశాంత్‌ ‘హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్’‌ సినిమా నుంచి తొలగించి స్టార్‌కిడ్‌ అయిన అర్జున్‌ను తీసుకున్నారంటూ మండిపడుతున్నారు. (జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌)

అంతేగాక ఈ సినిమాలో అర్జున్‌ నటనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘బాలీవుడ్‌లో బంధుప్రీతి(నెపోటిజమ్‌) ఎంతగా పేరుకుపోయిందో చూశారా. సుశాంత్‌ను తొలగించి అదిత్య రాయ్‌... రణ్‌వీర్‌లు.. లెజెండరి నటుడు అర్జున్‌ కపూర్‌లు సినిమా అవకాశాలు పొందారు’’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగిందా లేదా అన్యాయంగా సుశాంత్‌ను తొలగించడం వల్ల జరిగిందా? ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్‌ ఇప్పటికైనా సుశాంత్‌కు న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే భవిష్యత్తు‌లో మరికొందరు సుశాంత్‌లను పొగొట్టుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం బాలీవుడ్ స్టార్‌కిడ్స్‌ సినిమాలను బైకాట్‌ చేయాలని ఇకపై వారి సినిమాలు చూడొద్దంటూ పిలుపునిస్తున్నారు. (సుశాంత్‌ ఫైనల్‌ పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement