నేను హాట్‌ గాళ్‌నే!

Ready For Glamorous Roles Says Eesha Rebba - Sakshi

‘‘తెలుగు అమ్మాయిని కాబట్టి మన సంప్రదాయాలకు తగ్గ పాత్రలు చేసే అవకాశాలే దక్కాయి. నటిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. గ్లామరస్‌ పాత్రలకూ సిద్ధమే. నేను హాట్‌గాళే (నవ్వుతూ)’’ అన్నారు ఈషా రెబ్బా. శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో...’. ఈషా రెబ్బా ప్రధాన పాత్రధారి. కానూరి శ్రీనివాస్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా చెప్పిన సంగతులు.

►ఇందులో నా పాత్ర పేరు విద్య. భావోద్వేగంతో కూడిన పాత్ర ఇది. నేను నటించిన తొలి ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ కూడా కావడంతో మానసిక ఆందోళనకు గురయ్యాను. ఈ సినిమా సమయంలోనే మరో తమిళ సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చింది.

►ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌. 24 గంటల్లో జరిగే కథ ఇది. నా పాత్ర చుట్టూ అన్ని పాత్రలు తిరుగుతుంటాయి. అలా అని మిగతా పాత్రలకు ప్రాధాన్యం లేదని కాదు. అందరి పాత్రలు కీలకమే. స్క్రీన్‌ప్లే ఉత్కంఠగా

►‘‘ఢమరుకం’ మినహాయించి అన్నీ కామెడీ  సినిమాలు చేసిన శ్రీనివాస్‌రెడ్డి తొలిసారి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చేస్తున్నారు. ఎలా డైరెక్ట్‌ చేస్తున్నారు’’ అని నన్ను కొందరు అడిగారు. ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. ఈ జానర్‌లో అనుభవం ఉన్న దర్శకుడిలాగానే చేశారు.

►దర్శకుడు నన్ను నయనతారతో పోల్చారు అంటే అందుకు ఆయనకు థ్యాంక్స్‌. కానూరి శ్రీనివాస్‌ ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌.  

►నా కెరీర్‌ సంతృప్తికరంగానే సాగుతోంది. నాకు వచ్చిన అవకాశాల్లో ఫలానా పాత్ర సూట్‌ అవుతుందనుకుంటేనే గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తాను. కానీ డైరెక్టర్, హీరో, క్యారెక్టర్‌.. ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని కథకు ఓకే చెప్తాను. స్టార్‌ హీరో, పెద్ద డైరెక్టర్, సినిమా అంటే కథ ఓ మోస్తరుగా ఉన్నా ఓకే చెబుతాను. ఎందుకంటే అది నా కెరీర్‌కు హెల్ప్‌ అవుతుందని నమ్మకం.

►నెట్‌ఫ్లిక్స్‌ కోసం తెలుగు ‘లస్ట్‌ స్టోరీస్‌’లో నటించాను. హిందీ ‘లస్ట్‌ స్టోరీస్‌’కి ఇది డిఫరెంట్‌. సంకల్ప్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో జీవీ ప్రకాశ్‌తో కలిసి చేసిన సినిమా విడుదలకు సిద్ధమైంది. కన్న డలో శివరాజ్‌కుమార్‌ సినిమాలో నటించబోతున్నాను. ఓ తెలుగు సినిమాకు చర్చలు జరుగుతున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top