వీకెండ్‌ పార్టీ | Rashmika Mandanna Geetha Chalo released on may 3 | Sakshi
Sakshi News home page

వీకెండ్‌ పార్టీ

Apr 28 2019 1:58 AM | Updated on Aug 3 2019 12:30 PM

Rashmika Mandanna Geetha Chalo released on may 3 - Sakshi

రష్మికా మండన్నా

‘ఛలో, గీత గోవిందం, దేవదాస్‌’... ఇలా వరుస విజయాలతో తనకంటూ తెలుగులో మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకున్నారు రష్మికా మండన్నా. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మికా నటించిన  ‘గీతా–ఛలో’ ఈ నెల 26న విడుదల కావాల్సింది. అనివార్య కారణాల వలన ఈ చిత్రాన్ని మే 3న విడుదల చేస్తున్నామని చిత్రనిర్మాతలు మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్‌ తెలిపారు. దివాకర్‌ సమర్పణలో శ్రీ రాజేశ్వరి ఫిలింస్‌ – మూవీ మాక్స్‌ బ్యానర్లపై  ఈ చిత్రం విడుదల కానుంది.  ‘‘యువతరం మెచ్చే అన్ని హంగులు ఉన్న చిత్రమిది . వీకెండ్‌ పార్టీలు యువతకు మంచి చేస్తున్నాయా? చెడు చేస్తున్నాయా? అనే పాయింట్‌ చుట్టూ ఉన్న కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. కన్నడలో ‘ఛమ్మక్‌’ పేరుతో విడుదలైన ఈ చిత్రం దాదాపు 30 కోట్లు వసూలు చేసింది. మంచి చిత్రాన్ని అందరూ చూడాలనే ఉద్దేశంతో కంఫర్ట్‌ డేట్‌ మే 3న విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement