నాకు కథే ముఖ్యం..

Rashi Khanna Special Interview On Ayogya Movie - Sakshi

తమిళసినిమా: కమర్శియల్‌ పాత్రలతోనే సరిపెట్టుకోలేను అంటోంది నటి రాశీఖన్నా. టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఇప్పుడుకోలీవుడ్‌లో బిజీ అవుతోంది. వరుసగా తమిళ చిత్రాల అవకాశాలను దక్కించుకుంటోంది. ఇమైకా నోడిగళ్‌తో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడిప్పుడు జయంరవికి జంటగా అడంగ మను, సిద్ధార్థ్‌తో సైతాన్‌ కే బచ్చా అంటూ స్టార్‌ హీరోలతో నటించేస్తోంది. త్వరలో విశాల్‌ సరసన అయోగ్య చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. ఆ వివరాలు, ఈ ముద్దుగుమ్మ మనోభావాలేంటో చూద్దాం.

ప్ర: ఇమైకానోడిగళ్‌ చిత్రంలో నయనతారతో కలిసి నటించిన అనుభవం?
జ: ఆ చిత్రంలో నాకు నయనతారతో కలిసి నటించే సన్నివేశాలు లేవు. అయితే ఆమె గురించి చాలా విన్నాను. నేర్చుకున్నాను.

ప్ర: చిత్రాల ఎంపికలో మీరు తీసుకునే జాగ్రత్తలు?
జ:  ప్రస్తుతం వైవిధ్యభరిత కథా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అలా తనకొచ్చే అవకాశాలలో తన పాత్ర భాగం ఎంత అనే విషయం గురించి తెలుసుకోవడానికి తొలి ప్రాముఖ్యత నిస్తాను. అదే విధంగా కేవలం కమర్శియల్‌ చిత్రాల నాయకిగా నటించి వెళ్లి పోవాలనుకోవడం లేదు.  అందుకే ముందుగా స్క్రిప్ట్‌ పూర్తిగా చదివి ఆ తరువాత నా పాత్ర చుట్టు ఏం జరుగుతుంది? పాత్రకు ప్రాధాన్యత ఎంత? అన్న విషయాలను ఆలోచించి కథా పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాను.

ప్ర: కోలీవుడ్‌కు లేట్‌ ఎంట్రీ అనిపించడం లేదా?
జ: నిజం చెప్పాలంటే నా సినీ జీవితానికి ప్రణాళిక అంటూ ఏమీ చేసుకోను. తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుంటూ నటిస్తున్నాను. ఈ మధ్యనే తమి ళంలో అవకాశాలు వస్తున్నాయి. ఇక చిత్రాల ఎంపిక విషయంలో నేను భాష గురించి అస్సలు ఆలోచించను. గత ఏడా ది ఒక మలయాళ చిత్రంలో కూడా నటిం చాను. నాకు కథే ముఖ్యం. భాష కాదు.

ప్ర: ఇమైకా నోడిగళ్‌ చిత్రంలో రెండవ హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించడం గురించి?
జ: ఆ చిత్రంలో నా పాత్ర రూపకల్పనే అందుకు కారణం. ఇంతకు ముందు నటించిన  మలయాళం చిత్రంలో కూడా నా పాత్ర పరిధి తక్కువే. అయినా ఆ చిత్రంలో నాకు మంచి పేరు వచ్చింది.

ప్ర: తమిళంలో మీ పాత్రలకు డబ్బింగ్‌ చెప్పుకుంటారా?
జ: ఇమైకా నోడిగళ్‌ చిత్రంలో నటించే ముందు నేను టీచర్‌ను ఏర్పాటు చేసుకుని తమిళ భాష నేర్చుకున్నాను. తమిళంలో కూడా నా పాత్రలకు నేనే డబ్బింగ్‌ చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.

ప్ర: మీ డ్రీమ్‌?
జ: చాలెంజ్‌తో కూడిన పాత్రల్లో నటించి ప్రశంసలు పొందాలి. రాశీఖన్నా ఏ తరహా పాత్రనైనా చేయగలదు అని అనిపించుకోవాలి. ఇటీవల న డిగైయిన్‌ తిలగం చిత్రంలో నటించిన కీర్తీసురేశ్‌ నటన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాంటి పాత్రలో నటించాలని ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top