‘రంగస్థలం’ నిలిపివేత.. ఫ్యాన్స్‌ ఆందోళన | Rangasthalam Movie Stops In Theater Fans Fire | Sakshi
Sakshi News home page

Mar 30 2018 7:17 PM | Updated on Sep 5 2018 9:47 PM

Rangasthalam Movie Stops In Theater Fans Fire - Sakshi

నందిగామలోని మయూరి థియేటర్‌

సాక్షి, నందిగామ : కృష్ణ జిల్లా నందిగామలోని మయూరి థియేటర్‌లో రంగస్థలం చిత్ర ప్రదర్శనను మధ్యలో నిలిపివేసారు. దీంతో అభిమానులు ఆందోళన చేపట్టారు.  థియేటర్‌ యాజమాన్యం టికెట్‌ పై రేటు లేకుండా అధిక ధరలు రూ.100, రూ. 150లకు అమ్ముతున్నారని ప్రేక్షకులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ సూచనల మేరకు స్పందించిన స్థానిక తహశీల్దార్‌ థియేటర్‌కు చేరుకొని విచారణ పేరుతో చిత్ర ప్రదర్శనను మధ్యలో నిలిపివేశారు.

దీంతో అభిమానులు ఆగ్రహానికి లోనవ్వడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. రంగ ‍ప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌ కథానాయుకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకెళ్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement