‘గిది సిన్మార భయ్‌.. సీన్ చేయకండి’ | Ram Pothineni Responce On Trolls On iSmart Shankar | Sakshi
Sakshi News home page

‘గిది సిన్మార భయ్‌.. సీన్ చేయకండి’

Jul 23 2019 3:15 PM | Updated on Jul 23 2019 4:13 PM

Ram Pothineni Responce On Trolls On iSmart Shankar - Sakshi

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌ మసాలా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్‌ శంకర్‌. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే 50 కోట్లకుపైగా గ్రాస్‌ సాధించి సత్తా చాటింది. అయితే సినిమాలో మాస్‌ ఎలిమెంట్స్ కాస్త శృతిమించటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ విమర్శలపై హీరో రామ్‌ ఇస్మార్ట్ స్టైల్‌లో స్పందించారు. ‘హీరో హెల్మెట్ పెట్టుకోలేదు.. హీరో స్మోక్‌ చేస్తున్నాడు.. హీరో అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు.. ఎంత సేపు ఇవే గాని. అక్కడ హీరో అడ్డమొచ్చినవాళ్లని చంపేస్తున్నాడు అని ఒక్కళ్లు కూడా కంప్లయిన్‌ చేయటం లేదు. ప్రాణానికి విలువే లేదు. ఇది సిన్మార భయ్.. సీన్‌ చూడండి.. సీన్‌ చేయకండి’ అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement