‘కాదండి.. బాధ ఉండదండి..’ | Ram Gopal Varma Lakshmis Ntr Promotion | Sakshi
Sakshi News home page

‘కాదండి.. బాధ ఉండదండి..’

Mar 22 2019 10:08 AM | Updated on Mar 22 2019 10:11 AM

Ram Gopal Varma Lakshmis Ntr Promotion - Sakshi

లక్ష్మీస్‌ ఎన్టీఆర్ రిలీజ్ డేట్‌ దగ్గర పడుతుండటంతో వర్మ ప్రమోషన్‌ జోరు పెంచాడు. ఇప్పటికే వరుస ఇంటర్య్వూలతో హల్‌చల్‌ చేస్తున్న ఆర్జీవీ. సోషల్‌ మీడియాలోనూ తనదైన స్టైల్‌లో సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. గురువారం రాత్రి చంద్రబాబు నాయుడు తన మనవడ్ని ఎత్తుకున్న ఫోటోను ట్వీట్ చేసిన వర్మ ‘ఈ 29న మీ కుటుంబంతో కలిసి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూడండి’ అంటూ కామెంట్ చేశాడు.

ఈ ట్వీట్ పై ఓ అభిమాని ఆసక్తికరంగా స్పందించాడు. ‘నా కథ నన్నే చూడమంటున్నాడు. కాదండి.. బాధ ఉండదండి’ అంటూ వర్మకు రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లైని రామ్‌ గోపాల్‌ వర్మ రీ ట్వీట్‌ చేశాడు. తాజాగా డోనాల్డ్ ట్రంప్‌ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ గురించి మాట్లాడుతున్నట్టుగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు వర్మ. గతంలోనూ పలువురు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్‌ చూస్తున్నట్టుగా మీమ్స్‌ను రిలీజ్ చేసిన వర్మ ఇప్పుడు అభిమానులు రిప్లై ఇస్తున్న మీమ్స్‌ను కూడా రీ ట్వీట్‌ చేస్తూ మరింత వేడి పెంచుతున్నాడు. రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరిలు నిర్మిస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement