అనుష్క లుక్పై రాజమౌళి క్లారిటీ | Rajamouli Clarity on Anushka Look in Baahubali 2 | Sakshi
Sakshi News home page

అనుష్క లుక్పై రాజమౌళి క్లారిటీ

Feb 25 2017 1:24 PM | Updated on Jul 14 2019 4:05 PM

అనుష్క లుక్పై రాజమౌళి క్లారిటీ - Sakshi

అనుష్క లుక్పై రాజమౌళి క్లారిటీ

బాహుబలి 2 రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నతో పాటు

బాహుబలి 2 రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నతో పాటు మరో ప్రశ్న కూడా అభిమానులను వేదిస్తోంది. ఇటీవల బొద్దుగుమ్మగా మారిన యోగా బ్యూటి అనుష్కను రాజమౌళి ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నాడో అని అభిమానులు కంగారు పడుతున్నారు.  బాహుబలి తొలి భాగంలో అనుష్క పాత్ర చాలా  చిన్నది. ఆ కాస్త సేపు కూడా డీ గ్లామర్ రోల్లో కనిపించటంతో అనుష్క గ్లామరస్ లుక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కానీ ఇటీవల విడుదలైన సింగం 3, ఓం నమో వేంకటేశాయ సినిమాల రిలీజ్ తరువాత అభిమానుల్లో కంగారు మొదలైంది. బాహుబలి సినిమాలో అనుష్క రాణీగా కనిపించాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న లుక్లో రాణీగా చూపిస్తే ఎలా ఉంటుంది. అదే సమయంలో కొన్ని పోరాట సన్నివేశాల్లో కూడా కనిపించనుండటంతో అనుష్క పాత్ర సినిమాకు మైనస్ అవుతుందేమో అన్న అనుమానం ఏర్పడింది. అయితే బాహుబలి 2లో అనుష్క లుక్పై రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.

శివరాత్రి సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో సినిమా విశేషాలను పంచుకున్నాడు జక్కన్న. రెండో భాగంలో అనుష్క కనిపించే సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో అయిపోయిందట. ఇటీవల జరిగిన షూటింగ్లో కొన్ని షాట్స్ మాత్రమే చిత్రీకరించామన్న రాజమౌళి, అనుష్క లుక్ ఫస్ట్ లుక్లో కనిపించినంత గ్లామరస్ గానే ఉంటుందని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement