భార్య పాత్రలు బోర్‌ కొట్టవు

PSV Garuda Vega Actress Pooja Kumar Exclusive Interview

‘‘ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్, విలన్‌ ఉంటారు. కానీ, ‘గరుడవేగ’ చిత్రంలో అలా కాదు. 10 ముఖ్యమైన పాత్రలు ఉంటాయి. ఒక పాత్ర ఎక్కువ, మరో పాత్ర తక్కువ కాకుండా ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌ ఉంది’’ అని కథానాయిక పూజాకుమార్‌ అన్నారు. రాజశేఖర్, పూజాకుమార్‌ జంటగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పి.ఎస్‌.వి.గరుడవేగ 126.18ఎం’. జ్యో స్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై కోటేశ్వర్‌ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా పూజ  చెప్పిన సినిమా ముచ్చట్లు...
     
► నేను ఇప్పటి వరకూ చాలా స్క్రిప్ట్స్‌ విన్నాను. కానీ, ప్రవీణ్‌ సత్తారు 120 పేజీల బౌండెడ్‌ స్క్రిప్ట్‌ నాకిచ్చారు. బౌండెడ్‌ స్క్రిప్ట్‌ చదవడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. చాలా ఆసక్తికరంగా అనిపించింది. అతని విజన్‌ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ‘గరుడవేగ’ లో చేశా.
     
► యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. డ్రామా, ఎమోషన్స్‌ కూడా ఉంటాయి. తెలుగు ఇండస్ట్రీకి మార్గం చూపే సినిమా అవుతుంది. బైక్స్, ట్రైన్స్‌... యాక్షన్‌ సీక్వెన్సులు చాలా బాగుంటాయి. సినిమాని థియేటర్లో చూసినప్పుడే ఆ ఎంజాయ్‌మెంట్‌ ఉంటుంది.
     
► ఈ సినిమాలో నాది హౌస్‌ వైఫ్‌ క్యారెక్టర్‌. దేశం కోసం ఎక్కువ టైమ్‌ కేటాయించే భర్తకు  ఏమవుతుందో అని ఎప్పుడూ టñ న్షన్‌ పడుతూ, భర్త నుంచి కేరింగ్, అటెన్షన్‌ కోరుకునే భార్యగా నటించా. భార్య పాత్రలు ఎప్పటికీ బోర్‌ కొట్టవు. పైగా ఆ పాత్రలో చాలా విశేషాలుంటాయి.
     
► ఈ సినిమాకి ముందు రాజశేఖర్‌గారు పోలీస్‌గా నటించిన కొన్ని సినిమాలు చూశా. అద్భుతంగా నటించారు. ఆయన ఎనర్జీ సూపర్‌. ‘గరుడవేగ’లో యాక్షన్స్‌ సన్నివేశాలు చాలా బాగా చేశారు.
     
► సాధారణంగా క్లైమాక్స్‌లో హీరో, విలన్‌ మాత్రమే ఉంటారు. కానీ, ఈ మూవీ క్లైమాక్స్‌లోని కొన్ని యాక్షన్‌ సీన్స్‌లో నేనూ  ఉంటా. మలేషియా, జార్జియాలోనూ షూట్‌ చేశాం. కఠినమైన వాతావరణంలో కష్టపడి చేశాం. ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top