
వాస్తవ సంఘటన నేపథ్యంలో...
అనిల్‌కుమార్, శ్రుతిలయను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘ప్రేమభిక్ష’.
అనిల్‌కుమార్, శ్రుతిలయను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘ప్రేమభిక్ష’. ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో ఎం.ఎన్ . బైరారెడ్డి, నాగరాజు నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అనంతపురం జిల్లా భద్రపట్నంలో 1970లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా నిర్మించిన చిత్రమిది. స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉంటుంది.
కన్నడ రంగానికి చెందిన కొంతమంది ప్రముఖులు కూడా నటించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఘంటాడి కృష్ణ స్వరపరిచిన పాటలను త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఆర్.కె.గాంధీ, హీరో అనిల్‌కుమా, నటులు సుమన్ , జీవా, రాజేంద్ర, ఘంటాడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.