ఒక్క పాటకు 50 లక్షలు..! | Pooja Hegdes remuneration for Rangasthalam item song | Sakshi
Sakshi News home page

Feb 8 2018 11:07 AM | Updated on Feb 8 2018 12:47 PM

Pooja Hegde - Sakshi

పూజా హెగ్డే

గతంలో స్టార్ హీరోయిన్స్‌ ఐటమ్‌ సాంగ్స్ చేయడానికి పెద్దగా ఇంట్రస్ట్‌ చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే స్పెషల్‌ సాంగ్స్‌లో తళుక్కుమంటున్నారు తారలు. తమన్నా, కాజల్‌ లాంటి స్టార్ హీరోయిన్స్‌ కూడా స్పెషల్‌ సాంగ్‌తో అలరించారు. తాజాగా మరో అందాల భామ ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందట.

సుకుమార్‌ సినిమాలో వచ్చే ఐటమ్‌ సాంగ్స్‌ కు స్పెషల్‌ క్రేజ్‌ ఉంటుంది. అది కూడా రామ్‌ చరణ్‌ లాంటి క్రేజీ స్టార్ సరసన డ్యాన్స్‌ చేసే ఛాన్స్ కావటంతో పూజ కూడా వెంటనే ఒప్పేసుకుందట. అయితే ఈ ఒక్క పాటకు పూజ భారీ మొత్తాన్నే రెమ్యూనరేషన్‌ గా అందుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. జిల్‌ జిల్‌ జిగేల్‌ అంటే సాగే ఈ పాట కోసం పూజ ఏకంగా 50 లక్షల రూపాయల పారితోషికం అందుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. మరో ఈ వార్తలపై చిత్రయూనిట్‌ అధికారికంగా స్పందించకపోయినా.. క్రేజీ ఆఫర్స్‌తో ఫుల్‌ ఫాంలో ఉన్న పూజ హెగ్డేకు ఆ మాత్రం డిమాండ్‌ ఉంటుందంటున్నారు ఫ్యాన్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement