ముహూర్తం కుదిరిందా?

Pooja Hegde to romance Prabhas in Radha Krishna Kumar's next? - Sakshi

‘సాహో’ చిత్రం తర్వాత ప్రభాస్‌ నటించే కొత్త సినిమాకి ఎప్పుడు కొబ్బరికాయ కొడతారనే విషయంపై ఇంకా అధికారికంగా స్పష్టత రావడం లేదు. ‘సాహో’ తర్వాత ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఈ నెల 6న ముహూర్తం కుదిరిందని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ఈ నెల మూడోవారంలో ప్రారంభమవుతుందట. ఈ సినిమాకు సంబంధించిన మేజర్‌ షూటింగ్‌ యూరప్‌లో జరిపేలా చిత్రబృందం ప్లాన్‌ చేసింది. ఇందుకోసం ఆగస్టులో లొకేషన్‌ సెర్చింగ్‌ను కూడా పూర్తి చేసిందట టీమ్‌. ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో ప్రభాస్‌ బిజీగా ఉన్నారు. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top