ప్రభాస్ మరో కొత్త సినిమా మొదలు | Prabhas-Hanu Raghavapudi Movie Launch Officially | Sakshi
Sakshi News home page

Prabhas New Movie: 'సీతారామం' దర్శకుడితో ప్రభాస్.. మూవీ లాంచ్

Aug 17 2024 12:57 PM | Updated on Aug 17 2024 1:10 PM

Prabhas-Hanu Raghavapudi Movie Launch Officially

ప్రభాస్ మరో కొత్త సినిమా మొదలుపెట్టేశాడు. రీసెంట్‌గా 'కల్కి'తో వచ్చి రూ.1000 కోట్ల కొట్టేశాడు. ప్రస్తుతం 'రాజా సాబ్' చేస్తున్నాడు. ఇది కాకుండా సలార్ 2, కల్కి 2, స్పిరిట్ చేయాలి. ఇవి ఉండగానే 'సీతారామం' దర్శకుడు హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్ షురూ చేశాడు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ మూవీ ప్రారంభమైంది.

(ఇదీ చదవండి: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మారాల్సిన టైమ్ వచ్చిందేమో?)

శనివారం జరిగిన ఈ వేడుకకు 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వచ్చే వారం అంటే ఆగస్టు 24 నుంచి షూటింగ్ కూడా మొదలు కానుందని అంటున్నారు. అలానే ఈ సాయంత్రం 4 గంటలకు పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు.

మరోవైపు ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో తీస్తున్న సినిమాకు 'ఫౌజీ' అనే టైటిల్ ఫిక్స్ చేశారని, రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథని అంటున్నారు. వీటిన్నంటిపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది. అలానే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది కూడా తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన)

Advertisement
 
Advertisement
Advertisement