ప్రభాస్‌ అంటే ఇష్టం

Payal Rajput Wants to Share Screen with prabhas - Sakshi

‘‘డైరెక్టర్‌ అజయ్‌గారు ‘ఆర్‌ఎక్స్‌ 100’ కథ చెప్పినప్పుడు పాత్ర బాగా నచ్చింది. డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌. తెలుగు రాకుండా ఎలా నటిస్తానో అని భయపడ్డా. కానీ టీమ్‌ అంతా సపోర్ట్‌ చేయడంతో చేయగలిగాను’’ అని పాయల్‌ రాజ్‌పుత్‌ అన్నారు. కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నూతన దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’. అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ – ‘‘ఇంతకుముందు పంజాబీ సినిమాల్లో యాక్ట్‌ చేశాను. మరాఠీ చిత్రం ‘సైరాట్‌ ’ పంజాబీ రీమేక్‌లో నటించాను. ‘ఆర్‌ఎక్స్‌ 100’ నా తొలి తెలుగు సినిమా.

ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అజయ్‌ భూపతిగారు స్టోరీ న్యారేట్‌ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. అయన చెప్పినట్లు చేసుకుంటూ వెళ్లిపోయాను. స్క్రిప్ట్‌లో భాగమైనందుకే ఈ సినిమాలో లిప్‌ లాక్స్‌లో నటించా. నటిగా స్క్రిప్ట్‌కు న్యాయం చేయడం నా బాధ్యత అని భావిస్తాను. కార్తికేయ మంచి కో–స్టార్‌. రావు రమేశ్‌గారు, రాంకీగారు లాంటి సీనియర్‌ యాక్టర్స్‌తో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. పంజాబీ సినిమాలతో బిజీగా ఉన్నాను. సెప్టెంబర్‌లో నా సెకండ్‌ తెలుగు మూవీ స్టార్ట్‌ అవుతుంది. తెలుగు క్లాస్‌లకు వెళ్తున్నాను. పవన్‌ కల్యాణ్, మహేశ్‌బాబుల సినిమాలు చూశాను. ప్రభాస్‌ అంటే ఇష్టం. భవిష్యత్‌లో ఆయన సరస అవకాశం వస్తే, నటించాలని ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top