'పవన్ కళ్యాణ్ వస్తున్నారు' | pawan kalyan chief guest for A aa audio launch | Sakshi
Sakshi News home page

'పవన్ కళ్యాణ్ వస్తున్నారు'

Apr 29 2016 7:51 PM | Updated on Mar 22 2019 5:33 PM

'పవన్ కళ్యాణ్ వస్తున్నారు' - Sakshi

'పవన్ కళ్యాణ్ వస్తున్నారు'

నితిన్, సమంత జంటగా నటించిన 'అ ఆ' సినిమా ఆడియో ఫంక్షన్ డేట్ ఖరారైంది.

హైదరాబాద్: నితిన్, సమంత జంటగా నటించిన 'అ ఆ' సినిమా ఆడియో ఫంక్షన్ డేట్ ఖరారైంది. మే 2న శిల్పకళావేదికలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని హీరో నితిన్ వెల్లడించాడు. ఈ ఫంక్షన్ కు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ట్విటర్ ద్వారా తెలిపాడు. గతంలో నితిన్ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాలకు పవన్ హాజరయ్యారు.

కొద్ది రోజుల క్రితం 'అ ఆ' సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్ కు వెళ్లి నితిన్ ను ఆశ్చర్య పరిచారు పవర్ స్టార్. ఆయన ముందు నటించడం చాలా ఆనందాన్నిచ్చిందని, ఒకింత నెర్వస్గా ఫీలయ్యానని ఈ సందర్భంగా నితిన్ ట్వీట్ చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'అ ఆ' సినిమాకు 'అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి' అనేది ఉపశీర్షిక. మే నెలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement