బాబాయ్-అబ్బాయ్ ఫొటో అదిరింది | Pawan-Charan pic creating tremors | Sakshi
Sakshi News home page

బాబాయ్-అబ్బాయ్ ఫొటో అదిరింది

Sep 3 2016 7:24 PM | Updated on Mar 22 2019 5:33 PM

బాబాయ్-అబ్బాయ్ ఫొటో అదిరింది - Sakshi

బాబాయ్-అబ్బాయ్ ఫొటో అదిరింది

పవర్స్టార్ పవన్ కల్యాణ్కు, మెగా ఫ్యామిలీకి మధ్య దూరాలు ఉన్నట్లు ప్రచారం జరిగినా అవన్నీ ఒట్టి పుకార్లే అని పలుమార్లు తేలింది.

పవర్స్టార్ పవన్ కల్యాణ్కు, మెగా ఫ్యామిలీకి మధ్య దూరాలు ఉన్నట్లు ప్రచారం జరిగినా అవన్నీ ఒట్టి పుకార్లే అని పలుమార్లు తేలింది. ఇటీవల పవన్ చిన్న కూతురు పొలెన్.. చరణ్తో రాఖీ పండుగ చేసుకోవడం, ఆ తరువాత పవన్ సతీమణి అన్నా లెజ్నోవా.. మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలకు హాజరవ్వడంలాంటివి చూస్తుంటే ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని అర్థమవుతోంది.

తాజాగా పవన్ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఫ్యాన్స్ని అమితంగా ఆకట్టుకుంటోంది. 'సర్దార్ గబ్బర్సింగ్' సెట్లో తీసిన ఈ ఫొటో బాబాయి, అబ్బాయిల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూపెడుతోంది. దాంతో పవన్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ ఫొటోను షేర్ చేస్తూ మురిసిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement