అవి స్వార్థ రాజకీయాలే! : నటి

Parvathy Nair Opinion About Politics - Sakshi

సాక్షి, సినిమా: అవి స్వార్థ రాజకీయాలే నంటోంది నటి పార్వతీనాయర్‌. కోలీవుడ్‌లో ఎన్నై అరిందాల్, ఉత్తమవిలన్‌ చిత్రాల్లో నటించిన మలయాళీ బ్యూటీ ఈ అమ్మడు. మోడలింగ్‌ రంగం నుంచి వచ్చిన ఈ బ్యూటీ అందాలారబోతలోనూ జాణే. అయితే ఇప్పటికీ మంచి బ్రేక్‌ కోసం ఎదురు చూస్తున్న పార్వతీనాయర్‌ ప్రస్తుతం మాతృభాషలో మోహన్‌లాల్‌కు జంటగా నీరవీ చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఈ అమ్మడితో చిట్‌చాట్‌.

ఇంతకుముందు కమలహాసన్, అజిత్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించారు. ఇప్పుడు మోహన్‌లాల్‌తో నటిస్తున్నారు. ఎలా ఫీలవుతున్నారు?
నేను స్టార్‌ హీరోలతోనే నటిస్తాను. యువ హీరోలతో నటించను అని ఎప్పుడూ అనలేదు. ఇటీవల వర్థమాన హీరోలతో కూడా నటించాను. నా పాత్ర బాగుందనిపిస్తే నటించడానికి నేనుప్పుడూ రెడీనే.

ఎలాంటి కథా చిత్రాలలో నటించాలని ఆశిస్తున్నారు?
మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. నాలోని ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే అవకాశం రాలేదు. నేను చాలా సరదాగా ఉండే అమ్మాయిని. అయితే చిత్రాల్లో అన్నీ సీరియస్‌ పాత్రలే వస్తున్నాయి.

మీరు కమలహాసన్‌తో కలిసి నటించారు. ఆయనిప్పుడు రాజకీయ పార్టీని ప్రారంభించారు. అందులో చేరే అవకాశం ఉందా?
నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. అయితే రాజకీయపరమైన పుస్తకాలను చదువుతుంటా. ఇంకా కొంత కాలం తరువాతనే రాజకీయం, దాని గురించి అభిప్రాయాలు చెప్పలగను. ఇక రాజకీయాల్లో ఎవరికి మద్దతు అన్న విషయం గురించి ఇంకా అలోచించలేదు. అయితే ప్రజలకు నిజాయితీగా సేవ చేసే నాయకుడికే మద్దతిస్తాను.

తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రజలకు దగ్గరయిన మీరు ఈ మూడు రాష్ట్రాల్లో రగులుతున్న నీటి సమస్య గురించి ఎలా స్పందిస్తారు?
కావేరి నీటి సమస్య గురించి వార్తలు చదువుతున్నాను. అయితే దీనికి పరిష్కారం చెప్పే స్థాయి నాది కాదు. అయితే ఇది పూర్తిగా రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఆడే పెద్ద నాటకం అన్నది నా అభిప్రాయం. ఇప్పుడు రాష్ట్రాల ఎల్లలు దాటి ప్రజలు పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. అలాంటిది నీటిని ఇవ్వడానికి ప్రజలెవ్వరూ అభ్యంతరం చెప్పరు.

మీ రోల్‌ మోడల్‌ ఎవరు?
నేను ఒక్కొక్కరి నుంచి ఒక్కో విషయాన్ని నేర్చుకుంటాను. అయితే నటి మాధురిదీక్షిత్, శోభనలను రోల్‌మోడల్‌గా తీసుకుంటాను.

నచ్చిన హీరో, హీరోయిన్‌?
అజిత్‌. ఆయనంటే ఇంతకుముందే ఇష్టం. ఇప్పుడు ఇంకా ఇష్టం. నచ్చిన హీరోయిన్‌ నయనతార.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top