
నాగార్జున
మాములోడు కాదు ఈ ఆఫీసర్. జర డిఫరెంట్. అన్యాయం అనిపిస్తే చాలు గన్‌తోనే సమాధానం చెబుతాడు. అదెలాగో స్క్రీన్‌పై చూడాల్సిందే. నాగార్జున హీరోగా కంపెనీ పతాకంపై సుధీర్ చంద్రతో కలిసి రామ్‌గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమాకు ‘ఆఫీసర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ‘‘శ్రీదేవి చుట్టూ ఉన్న నెగిటివిటీ తర్వాత నా సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ పోస్టర్స్‌తో అంతా పాజిటివిటీ రావాలని కోరుకుంటున్నాను.
మై మోస్ట్ యాంబిషియస్ ఫిల్మ్ విత్ నాగార్జున’’ అంటూ రామ్‌గోపాల్ వర్మ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట్‌ను నాగార్జున ట్యాగ్ చేస్తూ– ‘‘నువ్వేం చెబుతున్నావో నాకు తెలుసు. ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని’ అనే ఫేమస్ సాంగ్ గుర్తొస్తోంది’’ అని పేర్కొన్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై ‘కాప్స్ వేర్ నెవర్ దిస్ స్కేరీ’ అనే లైన్ ఉంది. ఇందులో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నాగార్జున కనిపించనున్నారు. సినిమాను మే 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. నిజానికి ఈ సినిమా టైటిల్ అండ్ లుక్‌ను ఆదివారమే రిలీజ్ చేయాల్సింది కానీ హీరోయిన్ శ్రీదేవి హఠాన్మరణంతో వాయిదా వేశారు.