ఎంతో ప్రేమగా..! | NTR's stylish New look in Sukumar Movie | Sakshi
Sakshi News home page

ఎంతో ప్రేమగా..!

Oct 1 2015 1:04 AM | Updated on Sep 3 2017 10:15 AM

ఎంతో ప్రేమగా..!

ఎంతో ప్రేమగా..!

ఎన్టీఆర్‌కు 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో..’. ఇప్పటివరకూ ఆయన నటించిన 24 చిత్రాల్లోని లుక్స్‌కి పూర్తి భిన్నంగా, చాలా స్టయిలిష్‌గా

 ఎన్టీఆర్‌కు 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో..’. ఇప్పటివరకూ ఆయన నటించిన 24 చిత్రాల్లోని లుక్స్‌కి పూర్తి భిన్నంగా, చాలా స్టయిలిష్‌గా ఎన్టీఆర్ కనిపించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ దసరా కానుకగా విడుదల కానుంది. ఇటీవల లండన్‌లో భారీ షెడ్యూల్ జరిపామనీ, తదుపరి షెడ్యూల్‌ను అక్టోబర్ 20న మొదలుపెడతామని బీవీయస్‌యన్ ప్రసాద్ తెలిపారు. స్పెయిన్‌లో జరిగే ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందనీ, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ ఎంతో ప్రేమతో ఈ పాత్రలో ఒదిగిపోయారని ఆయన తెలిపారు.
 
 ‘ఛత్రపతి’ ప్రసాద్ అనిపించుకోవడం ఆనందం!
 ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ‘ఛత్రపతి’ విడుదలై, బుధవారానికి పదేళ్లయ్యింది. ఈ సందర్భంగా బీవీయస్‌యన్ మాట్లాడుతూ - ‘‘నిర్మాతగా నా తొలి చిత్రం ‘డ్రైవర్ బాబు’. 1986లో విడుదలైన ఈ చిత్రంలో శోభన్‌బాబు హీరోగా నటించారు. అప్పట్నుంచీ 2005 వరకు ఎన్నో చిత్రాలు నిర్మించాను. ఆ విధంగా ఇండస్ట్రీలో నాకు చాలా గుర్తింపు వచ్చింది. కానీ, పబ్లిక్‌లో కూడా నాకో ఇమేజ్ తెచ్చిన చిత్రం ‘ఛత్రపతి’. 2005లో విడుదలైన ఈ చిత్రం నా ఇంటి పేరులా స్థిరపడిపోయింది. అప్పట్నుంచీ అందరూ నన్ను ‘ఛత్రపతి’ ప్రసాద్ అంటుంటారు. అది ఆనందంగా ఉంటుంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement