
హైదరాబాద్: నటన, నాట్యం, వాక్చాతుర్యం వీటన్నింటకి మించి తన గొప్ప మనసుతో విశేష అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలతో సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. టాలీవుడ్‌లో అనేకమంది సెలబ్రెటీలకు అత్యంత ఆప్తుడైన ఎన్టీఆర్‌కు వారు ప్రత్యేకమైన బర్త్‌డే విషెస్ తెలిపారు. ఇక నందమూరితో పాటు సినీ అభిమానులు యంగ్‌టైగర్‌కు బర్త్‌డే సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇక తనపై నిస్వార్థమైన ప్రేమను కురిపిస్తూ బర్త్‌డే విషెస్ తెలిపిన వారందరికీ ఎన్టీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
‘మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. నా ప్రియమైన అభిమానుల్లారా మీకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అంటూ ఎన్టీఆర్ తన ట్విటర్‌లో భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశారు. ఇక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ మరో ట్వీట్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
చదవండి:
ఎన్టీఆర్‌కు వార్నర్ స్పెషల్ విషెస్!
బెస్ట్ గిఫ్ట్ ఇస్తాను : చరణ్
మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. My dear FANS, indebted to you for life 🙏🏻
— Jr NTR (@tarak9999) May 20, 2020