ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వెండితెరపై ఏం చూపించబోతున్నారు? ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో ఆయన ఎవర్ని టార్గెట్ చేశారు? సాధారణ స్థాయి నుంచి తెలుగు ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిన నటుడిగా ఎదిగిన ఎన్టీఆర్ జీవితం, అక్కణ్ణుంచి సీయంగా ఎదిగిన పరిణామాలను కాకుండా... ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత ఘట్టాన్నే తీసుకోవడంలో వర్మ ఆంతర్యం ఏంటి? ఇటువంటి ప్రశ్నలకు సోమవారం ‘సాక్షి టీవీ’ లైవ్‌కి విచ్చేసిన వర్మ సమాధానాలు ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే....
► స్నేహితులు, రచయితలతో మాటల సందర్భంలో ‘ఏపీలో ఎవరి లైఫ్‌పై బయోపిక్ తీస్తే బాగుంటుంది?’ అనడిగితే... ‘నో వన్ కెన్ బి బిగ్గర్ దేన్ ఎన్టీఆర్’ అన్నారు. అప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ తీయాలనుందని నేను ప్రకటించాను. ఐడియా వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌గారి లైఫ్ గురించి డీప్‌గా స్టడీ చేశా.
► లక్ష్మీ పార్వతిగారిని నేను కలవలేదు. ఆమె ఎన్టీఆర్‌గారి జీవితంలోకి వచ్చిన టైమ్‌లో నేను బాంబేలో ఉన్నా. అసలు, ఎన్టీఆర్‌గారి లైఫ్‌లోకి లక్ష్మీ పార్వతిగారు వచ్చిన తర్వాత జరిగిన సంఘటలను నా సినిమాకి కథగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే... ఎన్టీఆర్‌గారు సూపర్‌స్టార్, సూపర్ పొలిటీషియన్. ఓ గొప్ప వ్యక్తిగా ఉన్న ఆయన సడన్‌గా మామూలు మనిషిగా మారారు. ఆ టైమ్‌లో లక్ష్మీ పార్వతిగారు ఆయన లైఫ్‌లోకి ప్రవేశించారు. ఎన్టీఆర్‌గారు అలా కావడానికి, ఆ మానసిక స్థితిలోకి వెళ్లడానికి కారణమైన పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితుల్లోంచి ఏవేం జరిగాయి? ఎవరెవరు ఎంటరైతే ఎన్టీఆర్ ఎలా మారారు? మారిన వ్యక్తి గురించి ఎవరెవరు ఏమేం అనుకున్నారు? అనే అంశాలు నాకు ఆసక్తిగా అన్పించాయి.
► కథ గురించి ఎవరెవర్ని కలిశాననేది కొన్ని కారణాల వల్ల చెప్పలేను. కానీ, ఎన్టీఆర్‌గారి ఫ్యామిలీని మాత్రం కలవలేదు. కలవను కూడా! ఎందుకంటే... ఎన్టీఆర్‌గారితో ఎమోషనల్ కాంటాక్ట్ ఉన్నవాళ్లకు వ్యక్తిగతంగానో, రాజకీయంగానో, మరో రకంగానో ఏవో ప్రయోజనాలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని తమ అభిప్రాయాల్ని చెబుతారు. అప్పుడు నేను నిజాన్ని తెలుసుకోలేను. ఎవరికైతే వ్యక్తిగత ప్రయోజనాలు లేవో... వాళ్లను కలిశా. రామారావుగారింట్లో పనిచేసిన డ్రైవర్‌ని కలిశా. పనివాళ్లనూ, ఒక వంట వ్యక్తిని కూడా కలిశా. వాళ్లకు ఏం తెలీదని మనమంతా అనుకుంటాం. కానీ, మన ఇంట్లో పనిచేసే వాళ్లకు మన గురించి తెలిసినంత మనకు కూడా తెలీదని నేను నమ్ముతా.
► సినిమాలో నటీనటులుగా అందర్నీ కొత్తవాళ్లనే తీసుకుంటా. ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎవరెవరి రియల్ లైఫ్ క్యారెక్టర్స్ సినిమాలో పాత్రలుగా ఉంటాయో... ఇప్పుడే చెప్పలేను.
ఎన్టీఆర్ ఫ్యామిలీని కలవను!
Published Tue, Oct 17 2017 4:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement