కునుకు కరువాయె... | Night shootings about bollywood movies | Sakshi
Sakshi News home page

కునుకు కరువాయె...

Jun 1 2018 12:56 AM | Updated on Jun 1 2018 12:56 AM

Night shootings about bollywood movies - Sakshi

నమస్తే ఇంగ్లాండ్‌లో పరిణీతీ చోప్రా, అర్జున్‌ కపూర్‌

నిద్రలేకుండా వర్క్‌ చేస్తున్నారు కొందరు హీరోహీరోయిన్లు. సిల్వర్‌స్క్రీన్‌పై ఎగ్జామ్స్‌ కోసం నిద్రపోవడం లేదు. కనులకు కునుకుని దూరం చేసి సెట్‌లో వర్క్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ముందుగా టీ టౌన్లోకి వస్తే.. అల్లుడు నిద్రపోకుండా స్టెప్పులేస్తున్నాడు. అబ్బాయి చిందేస్తుంటే అమ్మాయి ఊరుకుంటుందా? ఆమె కూడా పాదం కలిపి పాట అందుకుంది. ఇంతకీ... ఈ అల్లుడు అడ్రెస్‌ ఎక్కడో తెలుసా? కేరాఫ్‌ శైలజారెడ్డి. ఇప్పుడు అర్థం అయ్యింటుంది ఇదంతా ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా గురించి అని.

నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అత్తయ్య శైలజారెడ్డి పాత్రలో నటి రమ్యకృష్ణ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నైట్‌ షూట్‌ జరుగుతోంది. నాగచైతన్య, అనూలపై సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. మరో తెలుగు హీరో కల్యాణ్‌ రామ్‌కి కూడా నిద్ర నహీ. గుహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేథా థామస్‌ కథానాయికగా నటిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా కోసం నైట్‌ షూట్‌ చేశారు.

ప్రస్తుతం సింగపూర్‌లో ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తోన్న కథానాయిక రాశీ ఖన్నా కూడా రెండు మూడు రోజుల క్రితం కంటిన్యూస్‌గా నైట్‌షూట్స్‌లో పాల్గొన్నారు. కానీ తెలుగు  సినిమా కోసం కాదు. కోలీవుడ్‌ సినిమా కోసం. కార్తీక్‌ తంగవేల్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అడంగామారు’ సినిమా చిత్రీకరణను రాత్రివేళ జరిపారు. మరో బ్యూటీ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అయితే ‘అలారం లేకుండా గురువారం హాయిగా నిద్రపోయాను’ అన్నారు. ఆమె ఎందుకలా అన్నారంటే.. కోలీవుడ్‌లో కార్తీ, బాలీవుడ్‌లో అజయ్‌దేవగన్‌ సినిమాల షెడ్యూల్స్‌లో పాల్గొని అలసిపోయారు.

కార్తీతో చేస్తోన్న సినిమా కోసం చెన్నైలో నైట్‌ షూట్స్‌లో పాల్గొన్నారామె. ఈ సినిమా చెన్నై షెడ్యూల్‌ చివరి రోజు తల్లి సెట్స్‌కు రావడంతో ఆమె ఆనందం డబులైంది. తమిళ సినిమా షూట్‌ కంప్లీటైన వెంటనే అజయ్‌ దేవగన్‌æ సినిమా కోసం ముంబై వెళ్లారు రకుల్‌. ఈ సినిమాకు అకివ్‌ అలీ దర్శకుడు. ఎలాగూ బీటౌన్‌ తలుపు తట్టాం కదా. అక్కడ కూడా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నవాళ్ల గురించి చెప్పుకుందాం. నిద్రకు నో చెప్పి, షూటింగ్‌కు యస్‌ చెప్పారు హృతిక్‌ రోషన్‌. ‘సూపర్‌ 30’లో ఆయన బీహార్‌ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్‌ పాత్ర చేస్తున్నారు.

వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ కానున్న ఈ సినిమా నైట్‌ షూట్‌లో పాల్గొంటూ హృతిక్‌ డే టైమ్‌లో నిద్రపోతున్నారు. ఇక బాలీవుడ్‌ భామల విషయానికొస్తే.. ‘నమస్తే ఇంగ్లాండ్‌’ సినిమా కోసం లండన్‌లో టైమ్‌కి నిద్రపోవడం లేదు కథనాయిక పరిణీతీ చోప్రా. విఫుల్‌ షా దర్శకత్వంలో అర్జున్‌ కపూర్, పరిణీతీ చోప్రా జంటగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ నైట్‌ టైమ్‌లో జరుగుతోంది. ఫోర్‌ డేస్‌ బ్యాక్‌ సాంగ్‌ను కూడా షూట్‌ చేశారు. నిద్ర లేకుండా వర్క్‌ చేయడం బాధగా ఉందా? అంటే... ‘అలా ఏం లేదు.. వర్క్‌ ఈజ్‌ వర్‌షిప్‌’ అంటున్నారు తారలందరూ. ఏం డెడికేషన్‌ గురూ.సినిమా అంటే నైన్‌ టు సిక్స్‌ జాబ్‌ కాదు. గంటలతో సంబంధం లేదు. రాత్రీ పగలూ తేడా లేదు. ఎప్పుడంటే అప్పుడు షూటింగ్‌లో పాల్గొనాల్సిందే. మరి.. సినిమానా? మజాకానా?


                            ఆనంద్, రాశీ ఖన్నా, ‘జయం’ రవి


                                  తల్లితో రకుల్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌, హృతిక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement