నా ప్రతిభను సరిగా వాడుకోలేదు | neetu chandra sensational comments on film industry | Sakshi
Sakshi News home page

నా ప్రతిభను సరిగా వాడుకోలేదు

Nov 16 2017 5:53 PM | Updated on Nov 16 2017 6:38 PM

neetu chandra sensational comments on film industry - Sakshi

సాక్షి, చెన్నై: అందం, అభినయంలో ఎవరికీ తగ్గని నటి, బెంగాలీ బ్యూటీ నీతూచంద్ర. 'యావరుం నలం' (తెలుగులో పదమూడు) చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయింది. అనంతరం ఆదిభవాన్‌ చిత్రంలో జయం రవితో పోటీపడి పోరాట సన్నివేశాల్లోనూ నటించి మెప్పించింది. అయితే సినిమా సూపర్‌ హిట్‌ సాధించినా అమ్మడుకి అవకాశాలు మాత్రం రాలేదు. ఎందుకనో తను పెద్దగా కోలీవుడ్‌ దృష్టిని ఆకట్టుకోలేకపోయింది.

అయితే అడపాదడపా కోలీవుడ్‌లో మెరుస్తున్న నీతూచంద్ర మాతృభాషలో నిర్మాతగా చిత్రాలు నిర్మిస్తోంది. తాజాగా ఈబ్యూటీ సినిమా వాళ్లపై పెద్దనిందనే వేస్తోంది. అదేమిటంటే తనలో ఉన్న ప్రతిభను ఎలా ఉపయోగించుకోవాలో సినీ పరిశ్రమకు తెలియదు అంటోంది. సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్‌ వంటి హీరోలతో నటించే ప్రతిభ తనలో ఉందని, అయినా తన ప్రతిభను సరిగా వాడుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంది. తన తండ్రి కేన్సర్‌ వ్యాధితో మరణించడంతో కుటుంబం, చిత్ర నిర్మాణ సంస్థ బాధ్యతలు చూసుకోవలసి వచ్చిందని అందుకే ఎక్కువ చిత్రాల్లో నటించాలని ఉన్నా కుదరడం లేదని తెలిపింది. మంచి కథ అనిపిస్తేనే నటించడానికి అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నట్లు నీతూచంద్ర చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement